జియో నుంచి వస్తున్న మరో ఉచిత ఆఫర్ .. మిస్ చేసుకోకండి

అంబానీ అధ్వర్యంలోని జియో భారతదేశంలోని మొబైల్ డేటా వ్యాపారాన్ని శాసిస్తోంది.కేవలం 4జి నెట్వర్క్ సర్వీసులపై 10 కోట్లకు పైగా కస్టమర్స్‌ ని రాబట్టున్న సంస్థ ప్రపంచం మొత్తంలో జియో ఒక్కటే.

 Jio Offers 100% Cash Back On Jio Fi But With A Condition-TeluguStop.com

ప్రస్తుతం ధనాధన్ ఆఫర్ తో ఒక రిఛార్జీపై మూడు నెలల అన్ లిమిటెడ్ కాలింగ్ మరియు 4G సర్వీసులు అందిస్తున్న జియో, మరోసారి ప్రత్యర్థుల గుండెల్లో రైళ్ళు పరిగెత్తే ఆఫర్ ని ప్రకటించింది.అదేంటో చూడండి.

ఇది జియోఫై ఎక్చెంజ్ ఆఫర్.Jiofi అంటే తెలుసు కదా, జియో అందిస్తున్న హాట్ స్పాట్ రూటర్.

దీంట్లో జియో సిమ్ వేసుకోని, వైఫై ఆన్ చేసుకోని 2G, 3G మొబైల్స్ లో కూడా జియో ఇంటర్నెట్ ని వాడుకోవచ్చు.ఈ డివైస్ ఖర్చు కేవలం 1999 రూపాయలు.

ఇప్పుడు మీకు ఇది పూర్తి ఉచితంగా దొరికే అవకాశం ఉంది.ఎలాగో తెలుసుకోవాలా?

చాలా సింపుల్ అండి, మీరు ప్రస్తుతం వాడుతున్న డొంగిల్, వైఫై రూటర్ ఏదైతే ఉందో, దాన్ని జియో కంపెనికి ఇచ్చి జియోఫై బాక్స్ తీసుకోవాలి.జియో ప్రైమ్ తీసుకోని, కనీసం 309 ప్యాక్ తో రీఛార్జీ చేసుకోవాలి.అంతే మీకు 100% క్యాష్ బ్యాక్ ఆఫర్ కింద మీకు చెల్లించిన డబ్బు వాపస్ వస్తుంది.

కాని మీరు వాడుతున్న డోంగిల్, రూటర్ మాత్రం వారికి ఇచ్చేయాల్సి ఉంటుంది.ప్రిపేయిడ్, పోస్ట్ పేయిడ్ .రెండురకాల కస్టమర్స్ కి ఈ ఆఫర్ వర్తిస్తుంది.ఆఫర్ నచ్చిందా ?

మీ డోంగిల్, రూటర్ ఇవ్వటం ఇష్టం లేకపోతే మాత్రం 1999 రూపాయలు పెట్టి డివైజ్ కొని, ఆ తరువాత ప్రైమ్ రీఛార్జీ, ప్యాక్ రిఛార్జీ చేసుకోవాల్సిందే.అన్నట్లు చెప్పడం మరచిపోయాం, మీరు ఎక్చెంజ్ ఆఫర్ పొందాలంటే మీ ఆధార్ కార్డు ఖచ్చితంగా తీసుకువెళ్ళాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube