దిమ్మదిరిగిపోయే షాక్ ఇచ్చిన జియో

అసలు ఎవరు ఊహించని విధంగా ఓ వారం కిందట ఓ ప్రకటన చేసింది జియో.అదే జియో సమ్మర్ సర్ప్రైజ్ ఆఫర్.

 Jio Discontinues Summer Surprise Offer-TeluguStop.com

జియో ప్రైమ్ యొక్క రిజిస్ట్రేషన్స్ ని ఏప్రిల్ 15 వరకు పొడిగించిన జియో, ఏప్రిల్ 15 లోపు ఎవరైతే జియో ప్రైమ్ సబ్ స్క్రిప్షన్ ని కలిగి ఉండి, ₹303 మంత్లీ ప్యాక్ .ఆపై రిఛార్జ్ చేసుకుంటారో, వారికి అదే మంత్లీ ప్యాక్ మూడు నెలలు పూర్తి ఉచితంగా, పేయిడ్ సర్వీసు మరో నెల కలుపుకోని, ఒకే రిఛార్జీపై నాలుగు నెలలు సర్వీసులు అందిస్తామని అనీల్ అంబాని ప్రకటించారు.

దాంతో జియో వినియోగదారుల సంఖ్య మరింత పెరిగింది.జియో ప్రైమ్ రిజిస్ట్రేషన్స్ మరింత ఊపందుకున్నాయి.ఎయిర్ టెల్, ఐడియా మార్కెట్ దారుణంగా పడిపోయింది.దాంతో ఆ కంపెనీలు ఈ ఆఫర్ ని ఎలాగైనా ఆపేయాలని ప్లాన్ వేసాయి.

ఒకేసారి రీఛార్జీపై నాలుగు నెలల సర్వీసులు అంటే ఇక మావైపు చూసేది ఎవరు? వ్యాపారంలో ఇలా అన్ని ఉచితంగా ఇస్తూపోవడం ఏంటి అంటూ Telecom Regulatory Authority Of India (TRAI) మీద ఒత్తిడి పెంచాయి.JIO Welcome Offer సమయంలోనే ఎయిర్ టెల్, ఐడియాల ఒత్తిడికి ఉక్కిరిబిక్కిరి అయిన ట్రాయ్, ఈసారి తలవంచింది.

జియో సమ్మర్ సర్ ప్రైజ్ ఆఫర్ ఇక లేదు.ఈసారి సర్ ప్రైజ్ కాకుండా పెద్ద షాక్ ఇస్తూ, జియో నిన్న రాత్రి విడుదల చేసిన ఓ ప్రకటన ద్వారా ఈ విషయాన్ని తెలిపింది.

ట్రాయ్ ఆదేశాలనుసారంగా మూడు నెలలు ఉచితంగా ఇవ్వాలనుకున్న ఆఫర్ ని ఇకపై ఇవ్వడం లేదు అని, ఇప్పటికిదాకా సమ్మర్ సర్ ప్రైజ్ ఆఫర్ పై రిఛార్జీ చేసుకున్న వారు మాత్రం బెంగ పెట్టుకోవద్దు .వారికి మాత్రం ఆఫర్ అందుబాటులో ఉంటుంది, ఇకనుంచి రిఛార్జీ చేసుకునే వారికి మాత్రం ఉండదని తెలిపింది జియో.

విషయం అర్థమయినట్లేగా? అల్రెడీ మీరు రిఛార్జీ చేసుకోని ఉంటే మీ ఉచిత ఆఫర్ కి ఎలాంటి ఢోకా లేదు.కాని ఇప్పుడు రీఛార్జీ చేసుకుంటే మాత్రం పెట్టిన డబ్బుకి 28 రోజుల సర్వీసు మాత్రమే జియో మీకు అందిస్తుంది.

మూడు నెలల ఉచిత సర్వీసు ఉండదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube