మళ్ళీ ఛాలెంజింగ్ విలన్ గా జగపతి బాబు

హీరో నుంచి బ్రేక్ తీసుకుని సెకండ్ ఇన్నింగ్స్ లో విలన్ గా మారిన జగపతి బాబు ఇప్పుడు సూపర్ క్రేజ్ తెచ్చుకున్నారు.విలన్ పాత్రలకి పెర్ఫెక్ట్ గా సింక్ అవుతూ తిరుగులేని ఇన్నింగ్స్ ని కొనసాగిస్తున్నారు ఆయన.

 Jb To Become Challenging Villain Again-TeluguStop.com

లెజెండ్ తో మొదలైన ఆయన ప్రస్థానం నాన్నకు ప్రేమతో లాంటి సూపర్ హిట్ లతో ఈ తరం ప్రేక్షకులకి పెర్ఫెక్ట్ విలన్ అంటూ పేరు తెచ్చిపెట్టాయి.తమిళం లో కూడా మంచి ప్రాజెక్ట్ లు సంతకం పెడుతున్న జగపతి బాబు ఇప్పుడు విజయ్ కొత్త సినిమా లో విలన్ గా సంతకం పెట్టారు అని మన వెబ్సైటు లో ఇదివరకే ప్రకటించాం

ఇప్పుడు జగపతి బాబు విశాల్ పక్కన కనపడబోతున్నారు.

విశాల్ హీరోగా తెరకెక్కనున్న ఓ కొత్త సినిమాలో జగపతిని విలన్‌గా కన్‌ఫర్మ్ చేశారు.ఇక గతంలో తాండవం, లింగా లాంటి సినిమాలతో తమిళంలో విలన్‌గా మెప్పించిన జగపతి బాబు, విజయ్, విశాల్‌లు నటించబోయే పలు క్రేజీ సినిమాల్లో విలన్‌గా నటించనుండడం మరో విశేషంగా చెప్పుకోవచ్చు.

ప్రస్తుతం తెలుగు, తమిళంలో టాప్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కొనసాగుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube