బుమ్రా సంపాదించేది కోట్లలో .. కాని 84 ఏళ్ల తాత బ్రతుకు ఇంకా పేదరికంలో

జస్ప్రీత్ బుమ్రా .పరిచయం అక్కరలేని పేరు ఇది.భారత జట్టుకి ఆడటం మొదలుపెట్టి కేవలం ఏడాదిన్నర గడిచింది, కాని బుమ్రా అప్పుడే టీ20 ఫార్మాట్లో ప్రపంచ నెం.1 ర్యాంకు సాధించాడు.ప్రస్తుతం నెం.2 ర్యాంకులో కొనసాగుతున్నాడు.మొన్న ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లో గాడితప్పి నోబాల్ వేసాడు కాని, అంతకుముందు భారత్ కి ఎన్నో విజయాలు అందించాడు బుమ్రా.రెండుమూడు సార్లు ఒంటిచేత్తో మ్యాచ్ ని గెలిపించాడు.

 Jasprit Bumrah Earns Crores But His 84 Year Old Grand Father Is Till Poor-TeluguStop.com

ఐపిఎల్ ద్వారా లభించిన ఈ వెరైటి బౌలర్, ఇటు భారత జట్టులో, అటు ముంబై ఇండియన్స్ జట్టులో ఓ కీలక సభ్యుడు.తన యార్కర్లతో ప్రత్యర్థులకి చుక్కలు చూపెట్టే బుమ్రా సంపాదన కూడా చుక్కలని తాకుతోంది.

ఇప్పుడు కొట్లలో గడిస్తున్నాడు ఈ 23 ఏళ్ల కుర్రాడు.కాని అతని 84 ఏళ్ల తాత మాత్రం ఇంకా పేదరికంలోనే ఉన్నాడు.

ఒక్కరోజు పని చేయడం మానేసిన పూట గడవని పరిస్థితిలో ఉన్నాడు.అలా ఎందుకో .ఆ కథ ఏంటో చూడండి.

బుమ్రా తాత పేరు సంతోక్ సింగ్ బుమ్రా.

ఒకప్పుడు సంతోక్ కి మూడు ఫ్యాక్టరీలు ఉండేవి.తన కొడుకు (బుమ్రా తండ్రి) జస్బీర్ బుమ్రాతో కలిసి ఆ ఫ్యాక్టరీలు నడిపారు సంతోక్.

కాని 2001 సంవత్సరంలో కొడుకు అనుకోకుండా చనిపోయాక బిజినెస్ నష్టాలను చూసింది.అప్పుడు సంతోక్ ఓ పెద్ద తప్పు చేసారు.

తన కోడలు మనవడు గురించి ఏమి ఆలోచించకుండా ఫ్యాక్టరీలను అప్పులు తీర్చేందుకు అమ్మేసి, వారిని అలానే వదిలేసి, అహ్మదాబాద్ విడిచి ఉత్తరాఖండ్ కి మకాం మార్చారు.తండ్రి లేని బిడ్డను పేదరికంలో పెంచింది బుమ్రా తల్లి.

తనకు అన్ని సహాయసహకారాలు అందిస్తూ క్రికెటర్ ని చేసింది.ఇంతింతై వటుడింతై అన్నట్లు బుమ్రా చాలా తక్కువ కాలంలోనే అంతర్జాతీయ క్రికెటర్ గా ఎదిగాడు.

మరోవైపు సంతోక్ కొత్త బిజినెస్ కోసం నాలుగు టెంపోలు కొని, ఆ బిజినెస్ లో కూడా నష్టాలు చూసి మళ్ళీ రోడ్డు మీద పడ్డాడు.ఇప్పుడు ఎలాంటి బిజినెస్ లేదు.

బతుకుదెరువు కోసం ఓ టెంపో నడుపుతున్నాడు.అది కూడా 84 ఏళ్ల వయసులో.

తన మనవడితో మాట్లాడి 17 ఏళ్ళు గడిచాయట.తల్లిని కష్టాల్లో వదిలేసాడని కాబోలు, బుమ్రాకి తాత మీద ఇంకా కోపం పోలేదు.

అందుకే తాతని అక్కున చేర్చే ప్రయత్నం కాని, ఆడుకునే యత్నం కాని చేయడం లేదు.మరోవైపు ఆ తాత మాత్రం బుమ్రా కోసం భారత్ ఆడే మ్యాచులు, ముంబై ఇండియన్స్ ఆడే మ్యాచులు మిస్ కాకుండా చూస్తున్నాడట.

తన ప్రాణం పోయేలోపు ఒక్కసారైనా మనవడిని కలుస్తానేమో అనే ఆశ ఇంకా ఉంది అంటున్నాడు బుమ్రా తాత.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube