పక్కా లోకల్ పబ్లిసిటీ.!

తాను ఐటం సాంగ్స్ చేయను చేయబోను అంటూనే జనతా గ్యారేజ్ లో పక్కా లోకల్ అంటూ టాప్ లేపిన కాజల్ ఆ సాంగ్ తో అమ్మడు ఐటం గాళ్ గా ఎంత అదరగొట్టిందో మనకు తెలిసిందే.అసలు హీరోయిన్స్ ఐటం సాంగ్స్ చేస్తే ఏ భామకు రాని క్రేజ్ కాజల్ కు దక్కింది.

 Janata Garage Team Pakka Local Publicity-TeluguStop.com

అఫ్కోర్స్ దేవి సాంగ్ మహిమా డ్యాన్స్ మాస్టర్ శేఖర్ స్టెప్పుల మహిమా అన్నది పక్కన పెడితే ఆ సాంగ్ తో కాజల్ ఎక్కడికో వెళ్లింది.ఈ పక్కా లోకల్ సాంగ్ వీడియో ఎప్పుడో రిలీజ్ చేశారు ఆడియో సంస్థ వారు.

కాని ఇప్పుడు ఆ ట్రాక్ డిలీట్ చేసి మళ్లీ దసరా కానుకగా కాజల్ పక్కా లోకల్ వీడియో సాంగ్ అప్ లోడ్ చేయబోతున్నారట.

జనతా గ్యారేజ్ దాదాపు అన్ని చోట్ల కలక్షన్స్ డ్రాప్ అయ్యాయి మరి ఈ టైంలో ఆ సాంగ్ రిలీజ్ చేసి ఇంకా ఏమన్నా కలక్షన్స్ దక్కించుకునే ప్రయత్నమేమో అంటున్నారు.

కాజల్ ఓ ఊపు ఊపేసిన పక్కా లోకల్ సాంగ్ సినిమాకే హైలెట్.మరి ఈ పక్కా లోకల్ పబ్లిసిటీ ఎవరికి ఏమాత్రం ప్లస్ అవుతుందో గాని కాజల్ పాపులారిటీ మాత్రం ఇంకా పెంచేస్తుంది అని మాత్రం చెప్పేయొచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube