పవర్‌స్టార్ తన పవర్ ఏంటో మరోసారి చూపించాడు.భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన కాటమరాయుడు ఓ మోస్తరు టాక్‌తో దూసుకెళుతోంది.
పవన్ జనసేన పార్టీ ద్వారా 2019 ఎన్నికల్లో పోటీ చేస్తుండడంతో కాటమరాయుడుకు పొలిటికల్ హంగులు కూడా తోడైంది.కాటమరాయుడు ప్రదర్శిస్తోన్న థియేటర్లలో పవన్ అభిమానులు జనసేన జెండా, కటౌట్లు పెట్టి ప్రీమియర్ షోలకు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.
ఫస్ట్ డే షోలు జరుగుతున్నప్పుడు లోపల థియేటర్లలోనే ఫ్యూచర్ సీఎం పవర్‌స్టార్.ఫ్యూచర్ సీఎం పవర్‌స్టార్ అంటూ జిందాబాద్‌లు కొట్టారు.
థియేటర్ల ముందు కూడా కటౌట్లలో జనసేన సింబల్స్, పవన్ సీఎం అంటూ ఫ్లెక్సీలు, బ్యానర్లు కట్టారు.ఇక సినిమాలో సైతం జనసేన ప్రస్తావన ఉంది.
అది మాటల్లో రాకపోయినా ఫస్ట్ సాంగ్ మిరా మిరా మీసం సాంగ్ చివర్లో జనసేన సింబల్ వస్తుంది.
సో మొత్తానికి పవన్ కాటమరాయుడులో తన పొలిటికల్ పార్టీ జనసేన టచ్చింగ్ ఇచ్చాడు.
ఇక పవన్ కాటమరాయుడు టాక్ ఎలా ఉందో తెలుసుకునేందుకు రాజకీయ పక్షాలు సైతం ఆసక్తి చూపిస్తున్నాయి.కాటమరాయుడు హంగామా తెలంగాణలో కంటే ఏపీలోనే అదిరిపోయే రేంజ్లో ఉంది.