నాని జై బాలయ్య కి రెడీ అయినట్లేనా

యువ హీరో నాని ఇటీవల ‘భలే భలే మగాడివోయ్‌’ చిత్రంతో ఘన విజయం సాధించిన విషయం తెల్సిందే.ఆ సినిమా తర్వాత నాని నటిస్తున్న సినిమాపై అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి.

 Jai Balayya Title Fixed For Nani-TeluguStop.com

‘అందాల రాక్షసి’ ఫేం హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న నాని తాజా చిత్రం టైటిల్‌ ఫిక్స్‌ అయ్యింది.ఈ చిత్రంలో నాని నందమూరి బాలకృష్ణకు వీరాభిమానిగా కనిపించబోతున్నాడు.

దాంతో ఈ చిత్రానికి మొదటి నుండి కూడా ‘జై బాలయ్య’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి.అయితే ఆ వార్తలను నాని రెండు సార్లు కొట్టి పారేశాడు.

చిత్ర యూనిట్‌ సభ్యులు సైతం టైటిల్‌ ఇంకా నిర్ణయించలేదు అని, త్వరలోనే టైటిల్‌పై ప్రకటన చేస్తాం అంటూ చెప్పుకొచ్చారు.

తాజాగా ఈ చిత్రానికి ‘జై బాలయ్య’ టైటిల్‌నే ఫిక్స్‌ చేసినట్లుగా తెలుస్తోంది.

ఈ టైటిల్‌తోనే ఈ చిత్రానికి మంచి పబ్లిసిటీ వస్తుందని, జై బాలయ్య అని ఉంటే వేరే హీరోల ఫ్యాన్స్‌ వస్తారో రారో అనే అనుమానంతో మొన్నటి వరకు టైటిల్‌పై నిర్ణయం తీసుకోలేక పోయారు.అయితే సినిమా బాగుంటే ఏ టైటిల్‌ పెట్టిన ప్రేక్షకులు పరుగెత్తుకుని థియేటర్‌కు వస్తారు అంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు తాజాగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

ఈ చిత్ర షూటింగ్‌ దాదాపు ముగింపు దశకు చేరుకుంది.వచ్చే నెల 10 ఆడియో విడుదల కార్యక్రమం నిర్వహించి, ఫిబ్రవరి మొదటి వారంలో చిత్రాన్ని విడుదల చేయాలని 14 రీల్స్‌ సంస్థ నిర్ణయించుకుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube