అంతా..అయిపోయాక!!!

గౌరవ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాపం పూర్తి రాజకీయ నాయకుడు అని అనిపించుకోలేకపోతున్నాడు…ఎందుకంటే జగన్ ఆలోచనా వైఫల్యమే అతన్ని ఈరోజు అధికారానికి దూరం చేసింది అని జగమెరిగిన సత్యమే.అయితే విషయం ఏమిటంటే…ప్రస్తుతం రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో ప్రజలకు ప్రశ్నించే నాయకుడు చాలా అవసరం.

 Jagan’s Wrong Step-TeluguStop.com

అలాంటి సమయంలో అందరి చూపు ప్రతిపక్షం పైనే ఉంటుంది.ఇక ప్రతిపక్షం కూడా అదే కోవలో ప్రశ్నించే స్థానంలో ఉండగాలగాలి…అంతేకాని అంతా అయిపోయాక ఏం చేసినా ఉపయోగం ఉండదు కదా…ఇప్పుడు రాజధాని విషయంలో కూడా జగన్ వైఖరి అలానే కనిపిస్తుంది…రాజధాని ప్రాంతంలో భూమీకరణ రెండు నెలల నుంచి జరుగుతోంది.

చాలామంది రైతులు.ముఖ్యంగా నదిపక్కన ఉన్న గ్రామాల రైతులకు తమ భూములివ్వడం ఏమాత్రం ఇష్టం లేదు.

అందుకే వారు సర్కారు తీరుపై బహిరంగంగానే మండిపడ్డారు.భూములిచ్చేది లేదని తేల్చిచెప్పారు.

కానీ వారి పోరాటానికి ప్రతిపక్షం నుంచి సరైన మద్దతు లభించలేదు.రైతులందర్నీ సమీకరించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటానికి కూడదీసే ప్రయత్నాలపై వైసీపీ అధ్యక్షుడు జగన్ అంతగా దృష్టిపెట్టలేదు.

అడపాదడపా వైసీపీ నేతల పర్యటనలు చేయడం తప్ప.సీరియస్ గా పోరాటం చేయలేదు.

రాజకీయంగా దెబ్బవుతుందనుకున్నారో.విధాన నిర్ణయం తీసుకోవడంలో జాప్యమో తెలియదు గానీ.

రాజధాని రైతుల గోడు వినిపించుకోలేదు.ఇక ఎన్ని సమస్యలు ఉన్నానూ.

మొత్తానికి ప్రభుత్వం భూసమీకరణ లక్ష్యాన్ని అధిగమించింది.రైతులను నయానో, భయానో ఒప్పించి.

మొత్తం 30 వేల ఎకరాలు సేకరించింది.ఇక అంతా అయిపోయాక సడన్ గా జగన్ ఇప్పుడు రాజధాని ప్రాంతంలో పర్యటించేందుకు రెడీ అయ్యాడు.

మార్చి 3న రాజధాని ప్రాంతంలోని మంగళగిరి, తాడికొండ, నియోజక వర్గ పరిధిలోని గ్రామాలు సహా తుళ్లూరులో పర్యటిస్తారని ఆ పార్టీ నేతలు వెల్లడించారు.మరి చేతులు కాలాక ఆకులు పట్టుకుని ఉపయోగం ఏముంది జగన్.

ఆలోచించు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube