దసరా విన్నర్ గా అక్కినేని అభిమానులు కాలర్ ఎగురవేసే హిట్ అందించిన ప్రేమం మూవీ నాగ చైతన్య కెరియర్ లో మైల్ స్టోన్ మూవీగా నిలుస్తుంది.ఇప్పటికే కలక్షన్స్ తో కేక పెట్టిస్తున్న ఈ సినిమా విజయానికి కారణం అంతా దర్శకుడిదే అంటున్నాడు చైతు.
మలయాళ వర్షన్ చూసి ఓ నెల రోజుల స్క్రిప్ట్ రాసుకుని వచ్చాడు చందు మొండేటి.అసలు తనతో ఓ స్ట్రైట్ సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్న చందుని తానే ప్రేమం కోసం ఒప్పించానని అన్నాడు నాగ చైతన్య.
ఇప్పుడు సినిమా ఈ రేంజ్ హిట్ సాధించింది అంటే కచ్చితంగా అది దర్శకుడు చందు మొండేటి వల్లనే అని సిన్సియర్ గా చెబుతున్నాడు చైతు.ఒక స్టార్ లెగసీ ఉన్న హీరో అయినా సరే తన సినిమా హిట్ కు కారణం దర్శకుడి ప్రతిభే అని చెప్పిన చైతు మంచి మనసుని మెచ్చుకుని తీరాలి.
యువతను ఎంతగానో ఆకట్టుకుంటున్న ఈ సినిమాకు పోటీగా వచ్చిన మిగతా సినిమాలన్ని యావరేజ్ టాక్ తెచ్చుకోవడంతో ప్రేమం మంచి వసూళ్లతో దూసుకుపోతుంది.
.