టీవి యాంకర్ గా ఎన్టీఆర్ .. చిరంజీవిలా తేడా కొట్టదుగా ?

సినిమా హీరోలు టీవి తెరపై యాంకర్లుగా రావడం బాలివుడ్ లో కొత్తేమి కాదు.ఆమీర్ ఖాన్ సత్యమేవ్ జయతే అనే పాపులర్ షో చేస్తుండగా, సల్మాన్ ఖాన్ దస్ కా దమ్ అనే ప్రోగ్రామ్ చేసేవాడు, ఇప్పుడేమో బిగ్ బాస్ చేస్తున్నాడు.

 It’s Official .. Ntr To Host Bigg Boss Show In Telugu-TeluguStop.com

షారుఖ్ ఖాన్ టీవీ వ్యాఖ్యతగా నాలుగైదు షోలు చేసినా ఏది సక్సెస్ కాలేదు పాపం.తమిళనాట సూర్య ఇప్పటికే ఓ షో చేసాడు.

తెలుగులో నాగార్జున సూపర్ సక్సెస్ అయితే, అదే “మీలో ఎవరు కోటీశ్వరుడు” హోస్ట్ చేసిన మెగాస్టార్ చిరంజీవి మాత్రం విఫలమయ్యారు.

ఇప్పుడు టీవిపై తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రాబోతున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్.

హిందీ “బిగ్ బాస్” ని దక్షిణాది రాష్ట్రాలకు పరిచయం చేసే పనిలో పడ్డారు మేకర్స్.కన్నడలో షోని ఈగ విలన్ సుదీప్ ఇప్పటికే హోస్ట్ చేస్తుండగా, తమిళంలో కమల్ హాసన్ ఈ షో చేసేందుకు ఒప్పుకున్నారు.

ఇక తెలుగులో ఎవరితో చేయిద్దామా అని తెగ అలోచించారు.సీనియర్ హీరోతో కాకుండా, ఈ జెనరేషన్ స్టార్ హీరో అయితేనే బాగుంటుందని ఎన్టీఆర్ ని వాళ్ళు అడగటం, ఎన్టీఆర్ ఓకే చెప్పటం చకచక జరిగిపోయాయి.

ఇంతవరకు తెలుగు టీవి చరిత్రలో ఎవరికి అందని రికార్డు స్థాయి పారితోషికం ఎన్టీఆర్ కి అప్పజెప్పనున్నారట.

హిందీలో కలర్స్ ఛానెల్ లో వచ్చే ఈ షో, తెలుగులో మాత్రం స్టార్ మాలో టెలికాస్ట్ కాబోతోంది.

ఈ షో ఎప్పుడు మొదలు కాబోతోంది? ఎవరెవరు పార్టిసిపేట్ చేయనున్నారు? ఈ షో కోసం ఎన్టీఆర్ ఒక్కో ఎపిసోడ్ కి ఎంత ఛార్జీ చేస్తున్నాడు? ఈ ప్రశ్నలకు సమాధానం ఇంకా తెలియాల్సి ఉంది.

అంతా బాగానే ఉంది.

కాని తెలుగులో ఫామ్ లో ఉన్న ఏ స్టార్ హీరో చేయని ప్రయోగం ఎన్టీఆర్ చేయబోతున్నాడు.చిరంజీవి, నాగార్జున వేరు .సీనియర్ నటులు.కాబట్టి ఫ్యామిలి ఆడియెన్స్ చూస్తారనే నమ్మకం ఉండేది.

మరి బిగ్ బాస్ లాంటి వివాదస్పదమైన షోని తెలుగు వాళ్ళ ఆదరిస్తారా ? షోని సక్సెస్ చేసి ఎన్టీఆర్ కొత్త ట్రెండ్ సృష్టిస్తాడా లేక మెగాస్టార్ లాగా చతికిలపడతాడా?

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube