బర్నింగ్ స్టార్ సంపూర్నేష్ బాబు.జనాలకి పెద్ద సెలబ్రిటి అయినా, సిద్దపేటలోని ఓ చిన్న గ్రామంలో మామూలు జీవితం మన సంపూది.
హీరో అవకముందు ఎలా ఉండేవాడో, ఇప్పుడు అలానే ఉన్నాడు.ఏమాత్రం మార్పు లేదు.
ఎంతోకొంత సంపాదించుకుంటే, అదంతా సేవ కార్యక్రమాలకే వినియోగించాడు.అలాంటి సంపూకి బిగ్ బాస్ ఓ సదవకాశం.
ఆ హౌస్ లో అతనే పెద్ద బ్రాండ్.తను ఎలాగైతే తెరమీద ఉంటాడో, అలానే బిగ్ బాస్ హౌస్ లో ఉండుంటే, ఆ షోని ఎన్టీఆర్ తో సహా విజయపథం మీదకి నడిపేవాడు, లక్షలకి లక్షలు వెనకేసుకునేవాడు.
కాని వారంలోనే రూల్స్ కి వ్యతిరేకంగా వెళ్ళిపోయి తుస్సుమన్నాడు.
బిగ్ బాస్ అగ్రిమెంట్ ప్రకారం సంపూకి పెనాల్టి పడాలి.16 లక్షల నుంచి 20 లక్షల పెనాల్టి అన్నారు.అంత డబ్బు ఒక్కసారిగా తీసుకురావాలంటే సంపూ అప్పు చేయాల్సిన పరిస్థితి.
అలాంటి కష్టకాలంలో సంపూని ఆదుకున్నాడు యంగ్ టైగర్.తనవల్లే షోకి వచ్చిన సంపూకి తానే సాయం చేసాడు.
ఎలాంటి పెనాల్టి పడకుండా అడ్డుకున్నాడు.మొత్తానికి సంపూర్నేష్ గండం నుంచి గట్టెక్కినట్టే.
అయితే పైకి మాత్రం పెనాల్టి పుకారు అని చెబుతున్నా, రూల్స్ ప్రకారం పడాల్సిందే కాని, షోకి చెడ్డపేరు రాకుండా రూమర్ అని చెబుతున్నారట.ఏదైతే ఏం .సంపూ ఇజ్ సేఫ్.
నిన్న బిగ్ బాస్ షో కి సర్ ప్రైజ్ ఎంట్రీ ఇచ్చాడు సంపూ.
వేదికపైనే ఎన్టీఆర్ కి కృతజ్ఞతలు చెప్పుకున్నా బర్నింగ్ స్టార్, అలాగే తన వాళ్ళ నిరుత్సాహపడిన ఆడియెన్స్ కి క్షమాపణలు చెప్పుకున్నాడు.ఆ తరువాత ఇది ఇలా ట్వీట్ వేసాడు.“మనకో కష్టమొచ్చినప్పుడు, మన సమస్యల్లో భుజం తట్టినవాడే నిజమైన హీరో…మీరే నా బిగ్ బాస్ అన్న గారు… ప్రేక్షక దేవుళ్ళకి క్షమాపణలు కోరుకుంటూ … ఇంతటి అవకాశాన్నిచ్చిన బిగ్ బాస్ వారికి, స్టార్ మా ఛానల్ వారికి, ఛానల్ సిబ్బందికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు.పెనాల్టీ లాంటివి పుకార్లు మాత్రమే”
.