ఒకే సినిమా కోసం మహేష్ - ఎన్టీఆర్ ఎదురుచూపులు-ISM Result Becomes Important For Mahesh And NTR 3 months

 Photo,Image,Pics-

అస్థిరతకు మారుపేరుగా పూరిజగన్నాథ్ పేరుని చెబుతారు తెలుగు ఇండస్ట్రీలో. ఎప్పుడు హిట్ కొడతారో, ఎప్పుడు ఫట్ అనిపిస్తారో కనిపెట్టడం కష్టం. బద్రి, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి, పోకిరి, బిజినెస్ మెన్, టెంపర్ లాంటి చిత్రాలు తీసిన పూరి, ఆంధ్రవాలా, ఏక్ నిరంజన్, దేవుడు చేసిన మనుషులు, జ్యోతిలక్ష్మీ లాంటి సినిమాలు పూరి ఒకరేనా అనే అనుమానం వస్తుంది.

చాలాకాలం క్రితమే అగ్రహీరోల నమ్మకాన్ని కోల్పోయారు పూరి. బిజినెస్ మెన్ ని బాక్సాఫీసు లెక్కలో హిట్ కింద వేసుకున్నా, ఆ సినిమా ఆశించనంత పెద్ద సెక్సెస్ ఏమి కాదు. కారణం, ఫ్యామిలి ఆడియెన్స్ పూరి సినిమాలకి దూరం కావడమే. అప్పుడే మహేష్ కి పూరి పెన్నుపై కాస్త అపనమ్మకం కలిగిందని, అందుకే పోకిరి లాంటి హిట్ ఇచ్చిన డైరెక్టర్ ని కూడా ఇప్పుడు పెద్దగా పట్టించుకోవట్లేదని టాక్.

ఇక ఎన్టీఆర్ విషయానికి వస్తే, టెంపర్ చేసేందుకు ప్రధాన కారణం, వక్కంతం అందించిన కథే తప్ప, పూరి జగన్నాథ్ కాదని అప్పట్లోనే అనుకున్నారు చాలామంది. అంటే పూరి సొంత కథతో వచ్చుంటే ఎన్టీఆర్ కూడా అంత త్వరగా ఒప్పేసుకునేవాడు కాదేమో. ఇప్పుడు జరుగుతున్నది అదే తంతుగా. సినిమా ప్రకటించినా పట్టాలు మాత్రం ఎక్కట్లేదు. టెంపర్ లాంటి గేమ్ చేంజర్ ని ఇచ్చినా, పూరి పెన్నుపై ఎన్టీఆర్ కి కూడా అపనమ్మకమే.

సినిమాలో కథకు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదని, సినిమాల్ని చుట్టేస్తున్నాడని, హీరోయిన్ పాత్రలు బాగుంట్లేదని, బూతులు కూడా డైలాగులైపోతున్నాయని, ఓరకమైన పైత్యం తన సినిమాల్లో ఉంటుందని .. ఇలా పేజిలకొద్ది కంప్లయింట్స్ ఉన్నాయి పూరి మీద. అందుకే, తన తదుపరి సినిమాలు మహేష్, ఎన్టీఆర్ తో అని పూరి చెబుతున్నా, ఆ హీరోలు మాత్రం సడిచప్పుడు చేయట్లేదు. ఇప్పుడు ఇద్దరు హీరోల ఎదురుచూపులు “ఇజం” వైపే. ఇది హిట్ అయితేకాని, పూరి మీద ఆసక్తి పుట్టదేమో!

మీ కోసం సూచించబడిన ఈ స్పెషల్ స్టోరీ చూడండి.. తమిళ హీరోలకి ఉన్న ధైర్యం తెలుగు హీరోలకి లేదా ?

About This Post..ఒకే సినిమా కోసం మహేష్ - ఎన్టీఆర్ ఎదురుచూపులు

This Post provides detail information about ఒకే సినిమా కోసం మహేష్ - ఎన్టీఆర్ ఎదురుచూపులు was published and last updated on in thlagu language in category Telugu Movie News,Telugu News.

Kalyan Ram, Ism Movie Result, Director Puri Jagannadh, Ntr, Mahesh Babu, Next Movies, ఒకే సినిమా కోసం మహేష్ - ఎన్టీఆర్ ఎదురుచూపులు

Tagged with:Kalyan Ram, Ism Movie Result, Director Puri Jagannadh, Ntr, Mahesh Babu, Next Movies, ఒకే సినిమా కోసం మహేష్ - ఎన్టీఆర్ ఎదురుచూపులు,సినిమా Saxy Aunty Com