ఇండియాపై మరోసారి ఉగ్రదాడి?

భారత్‌పై మరోసారి ఉగ్రవాదులు దాడి చేయబోతున్నారా? అందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారా? ఈ ప్రశ్నలకు ‘యుఎస్‌ఏ టుడే’ పత్రిక ‘అవును’ అని సమాధానం చెబుతోంది.దీనిపై ఈ పత్రిక పరిశోధనాత్మక కథనం ప్రచురించింది.

 Islamic State Preparing To Attack India-TeluguStop.com

కొంతకాలంగా ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఐఎస్‌ఐఎస్‌ (ఇస్లామిక్‌ స్టేట్‌) ఇండియాపై దాడి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు యుఎస్‌ టుడే కథనం తెలియచేసింది.ఇండియాపై ఉగ్రదాడులకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలియచేసే ఉర్దూలోఉన్న ముప్పయ్‌ రెండు పేజీల డాక్యుమెంట్‌ ఒక పాకిస్తానీ జాతీయుడి దగ్గర లభ్యమైంది.

ఇతనికి పాకిస్తానీ తాలిబన్లతో సంబంధాలున్నాయి.భారత్‌కు అమెరికాతో మంచి సంబంధాలు ఉన్న నేపథ్యంలో అది సహించలేని ఇస్లామిక్‌ స్టేట్‌ భారత్‌పై దాడులు చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది.

ఇస్లామిక్‌ స్టేట్‌పై అమెరికా తన మిత్ర దేశాలతో కలిసి దాడులు చేసినట్లయితే ముస్లింలందరూ ఏకమవుతారని, ఈ పరిణామం చివరి యుద్ధానికి దారి తీస్తుందని ఆ డాక్యుమెంట్ తెలియచేసింది.ఈ డాక్యుమెంట్‌ను అమెరికా మీడియా ఇన్‌స్టిట్యూట్‌ ఇంగ్లిషులోకి అనువదించింది.

ఇస్లామిక్‌ స్టేట్‌ దాడి చేయాలనుకుంటున్న సంగతి నరేంద్ర మోదీ సర్కారుకు తెలిసే ఉంటుంది.అమెరికన్‌ నిఘా సంస్థలు హెచ్చరించేవుంటాయి.

ఇది చాలా సీరియస్‌గా తీసుకోవాల్సిన విషయం.మరి మోదీ ప్రభుత్వం అప్రమత్తంగా ఉంటుందా?

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube