అమ్మనాన్న ఓ తమిళమ్మాయి సినిమా తర్వాత మదర్ సెంటిమెంట్ సినిమా చేయలేదన్న పూరి ఇప్పుడు లోఫర్తో మదర్ సెంటిమెంట్ బేస్డ్ మూవీని చేశానని చెప్పుకొచ్చాడు.ఈ సినిమా చూడటానికి పూరి గతంలో డైరెక్ట్ చేసిన అమ్మనాన్న ఓ తమిళమ్మాయి, ఏక్ నిరంజన్ తరహాలో ఉంటుందని వార్తలు వినపడుతున్నాయి.
అమ్మనాన్న ఓ తమిళమ్మాయి సినిమాలో హీరో తల్లికి దగ్గరగా ఉంటాడు.మధ్యలో తండ్రి దగ్గరకు వస్తాడు.
తండ్రి, కొడుకుల మధ్య జరిగే కథగా మారుతుంది.ఇక ఏక్ నిరంజన్ విషయానికి వస్తే ఓ వ్యక్తి ఓ బిడ్డను తల్లిదండ్రుల నుండి వేరు చేస్తాడు.
చివర వరకు తల్లిదండ్రుల ప్రేమ కోసం ఆ బిడ్డ తపన పడుతుంటాడనదే కథ.లోఫర్ విషయానికి వస్తే ఈ సినిమాలో పోసాని, రేవతి భార్యభర్తలు.
పోసాని వెధవచేష్టలు చేస్తుంటాడు.ఓ సందర్భంలో భార్య రేవతికి పుట్టిన బిడ్డ అప్పుడే చనిపోయాడని చెప్పి దూరంగా తీసుకెళ్ళి పెంచుతాడు.
కొడుకు లోఫర్లా తయారుచేస్తాడు.వరుణ్ తేజ్ డబ్బుకోసం ఏమైనా చేసే వ్యక్తిగా ఎదుగుతాడు.
కానీ చివరకు తన తల్లి బ్రతికే ఉందని తెలుస్తుంది.కన్నతల్లి ప్రేమ కోసం కొడుకు ఏం చేశాడనేదే లోఫర్ కథ అని ఇండస్ట్రీ వర్గాల మాట్లాడుకుంటున్నాయి.