నిద్రమాత్రలు తీసుకుంటే మంచిదేనా?

గజిబిజి జీవితం వలన లైఫ్ స్టయిల్ పూర్తిగా మారిపోయింది.ఎప్పుడు తినేది తెలియదు.

 Is Taking Sleeling Pills Good For Health?-TeluguStop.com

ఎప్పుడు నిద్రపోయేది తెలియదు.ఎన్నిగంటలకు నిద్రపోతామో ఎప్పుడు లేస్తామో చెప్పలేం.

ఇలాంటి పరిస్థితులలో రోజికి 7-8 సుఖంగా నిద్రపోవాల్సిన మనిషి రోజుకి 4-6 గంటలు నిద్రపోతున్నాడు.అందుకు కారణం సుస్పష్టం.

పని ఒత్తిడి వలనో, ఇతర అలవాట్ల వలనో రాత్రి 11-12 అయితే కాని నిద్రరాదు.అలాగే ఉదయాన్నే త్వరగా నిద్రలేవకపోతే పనులకి అందలేము.

అందుకే ఇలాంటి సమస్యలు.కొందరికైతే 2 గంటలకు మించి నిద్రరాదు.

ఈ సమస్యనే INSOMNIA అని అంటారు.ఈ సమస్యకు పరిష్కారంగా కొందరు ఎంచుకునే మార్గం “నిద్రమాత్రలు”.

ఇవి తీసుకోవటం వలన ఎలాంటి హాని లేదా అంటే ఉంది, చాలా ఉంది.

నిద్రమాత్రలను తీసుకునే అలవాటు ఉన్నవారికి క్యాన్సర్ వచ్చే ప్రమాదం చాలావరకు పెరిగిపోతుందని 2012 లో ఓ సర్వే బల్లగుద్ది చెప్పింది.

స్లీపింగ్ పిల్స్ వలన అలసట పెరుగుతుందని, కొన్నిసార్లు ఉదయం నిద్రలేచాక కూడా సరిగా మత్తు వదలదని డాక్టర్లు చెబుతారు.అలాగే స్లిపింగ్ పిల్స్ వాడే అలవాటు ఉన్నవారికి మలబద్ధకం, చేతుల్లో, కాళ్ళల్లో మంట, గ్యాస్, తలనొప్పి, వాంతులు, గొంతు ఎండటం, నొప్పి, బలహీనంగా అనిపించడం లాంటి సైడ్ ఎఫెక్స్ చూడవచ్చు.

అలాగే నిద్రమాత్రలకు అలవాటు పడితే, ఒకటి అవి లేకుండా నిద్రపోవడం కష్టమైపోతుంది, రెండు మన ప్రాణానికి ఎప్పుడు గ్యారంటీ ఉండదు.

అలాగని చెప్పి, నిద్రమాత్రలను పూర్తిగా వాడకూడదని కాదు, కాని డాక్టరు ఇస్తే తప్ప వాడకూడదు.

మీ హెల్త్ స్టేటస్ ని బట్టి, డాక్టరు ప్రెస్క్రైబ్ చేసిన మెడిసిన్ మాత్రమే వాడాలి.ఎప్పుడూ కూడా, పేరు తెలుసు కదా అని, మనకు ఇష్టవచ్చిన రీతిలో, ఇష్టమొచ్చిన నిద్రమాత్రను వాడకూడదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube