ఒక్కోసారి మనం జరిగే విషయాల్ని ముందే కలలో ఎలా చూస్తాం?

మీరు ఏదో వీధి వెంట నడుచుకుంటూ వెళుతున్నారు.సడెన్ గా ఏదో దృశ్యం కనిపించింది.

 Is Precognition Real Or Fake?-TeluguStop.com

మీలో ఆశ్చర్యం .ఎందుకంటే దీన్ని మీరు ముందే చూసారు అని అనిపిస్తోంది.నేను కలలో చూసిందే మళ్ళీ ఇక్కడ ఎందుకు జరుగుతుందో అర్థం కావడంలేదు.కాసేపు ఇదంతా నిజమేనా కదా అనే అనిశ్చితి.ఇలా మీలో ఎవరికైనా జరిగిందా? జరిగే ఉంటుంది.కాని దాన్ని మనం బయటకి చెప్పుకోవడానికి సంకోచిస్తాం.

ఇలా జరిగింది అని చెబితే జనాలు పిచ్చివాళ్ళలా చూస్తారేమో అని భయపడతాం.అసలు ఇలా ఎందుకు జరుగుతుంది? ఈ కండీషన్ ని ఏమంటారు ?

Precognition .ఈ పదం గురించి ఎప్పుడైనా విన్నారా? Precognition లో ముందు జరిగే విషయాల్ని ముందే పసిగడతారు.అంటే ప్రమాదాల్ని ముందే గుర్తిస్తారు అన్నమాట.

ఈ టాపిక్ మీద హాలివుడ్ వారు చాలా సినిమాలే తీసారు.ఫైనల్ డెస్టినేషన్ అని, మైనారిటి రిపోర్ట్ అని .ఇలా కొన్ని సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి.ఇప్పుడు మహేష్ బాబు తీస్తున్న స్పైడర్ కూడా ఇంచుమించు ఇలాగే ఉంటుందని చెబుతున్నారు.

స్పైడర్ లో మహేష్ బాబు తన స్పైడర్ సెన్స్ తో ప్రమాదాలని పసిగట్టి ప్రజల్ని రక్షిస్తాడని ఓ టాక్.అందులో నిజమెంతో తెలియదు.

అయితే ప్రికగ్నీషన్ అంటే కేవలం ప్రమాదాలనే గుర్తుపట్టడం కాదు, భవిష్యత్తులో జరిగే కొన్ని విషయాన్ని అయినా ముందే ఊహించటం.చెప్పాలంటే ఎడమ కన్ను అదురుతోంది అంటే ఏదో కీడు జరుగుతుంది, కుడి కన్ను అదురుతోంది అంటే ఏదో మేలు జరుగుతుంది, ఇవి కూడా ప్రికగ్నీషన్ నమ్మకాల కిందికే వస్తాయి.

మరి ఇదంతా నిజమా? భవిష్యత్తులో జరగబోయే కొన్ని విషయాలని మనిషి ముందే పసిగట్టగలడా? ఈ సిక్త్ సెన్స్ అనేది నిజంగానే ఉందా? సైన్స్ దీని గురించి ఏమంటోంది ?

ఈ ప్రికగ్నీషన్ కూడా “దెయ్యం” లాంటిదే.ప్రికగ్నీషన్ కూడా ఓ మూఢనమ్మకం అంటారు.

తమకు ఇలా జరిగింది అంటూ వ్యక్తులు అనుభవాలు పంచుకుంటారు, కాని వీటిని సైన్స్ నమ్మదు.దెయ్యం ఉందా లేదా, దేవుడు ఉన్నాడా లేడా, ఈ రెండిటి తరువాత స్పష్టమైన జవాబు లేని ప్రశ్న ఇదే.ప్రికగ్నీషన్ నిజమని చెప్పేందుకు సాక్ష్యాలు లేవు.అలాగే వ్యక్తులు చెప్పే అనుభవాలను సింపుల్ గా కొట్టిపారేయలేం.

కాని ఈ ప్రికగ్నిషం అనుభవాలు చెప్పుకోవడానికి బాగుంటాయి, అచ్చం దెయ్యం కథల్లాగే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube