పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే.ఆ సినిమా చిత్రీకరణ పూర్తి అయిన వెంటనే తమిళ సూపర్ హిట్ చిత్రం ‘వేదాళం’ రీమేక్‌లో ఈయన నటించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
ఈ సినిమా రీమేక్‌కు ‘రభస’ ఫేం సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహించనున్నాడు అంటూ ప్రచారం జరిగింది.అయితే ఆ వార్తలు కేవలం పుకార్లు మాత్రమే అని, ఇంకా రీమేక్‌పై ఒక స్పష్టత రాలేదు అంటూ తమిళ నిర్మాత రత్నం చెప్పుకొచ్చాడు.
‘వేదాళం’ చిత్రం రీమేక్‌లో పవన్ నటించే విషయంలో కూడా ఇంకా అధికారిక క్లారిటీ రావడం లేదు.నిర్మాత అధికారికంగా ఈ రీమేక్‌లో పవన్ నటించనున్నాడు అంటూ చెప్పకపోయినా కూడా, అనధికారికంగా మాత్రం పవన్‌తో సినిమా నిర్మించేందుకు ఆయన ఏర్పాట్లు చేస్తున్నాడు.
దర్శకుడు ఫిక్స్ కాలేదు అనే విషయాన్ని కూడా నిర్మాత పేర్కొన్నాడు.అతి త్వరలోనే ఈ సినిమా రీమేక్ పట్టాలెక్కే అవకాశాలున్నాయని తమిళ సినీ వర్గాల నుండి సమాచారం అందుతోంది.
ఏప్రిల్‌లో ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తే ఆ తర్వాత మే లేదా జూన్‌లో ‘వేదాళం’ రీమేక్‌ను పవన్ ప్రారంభించే అవకాశాలున్నాయని పవన్ సన్నిహితులు చెబుతున్నారు.