పవన్‌ మూవీ వార్తలు పుకార్లే

పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ ప్రస్తుతం ‘సర్దార్‌ గబ్బర్‌సింగ్‌’ చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే.ఆ సినిమా చిత్రీకరణ పూర్తి అయిన వెంటనే తమిళ సూపర్‌ హిట్‌ చిత్రం ‘వేదాళం’ రీమేక్‌లో ఈయన నటించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

 Is Pawan’s Next Vedalam Remake-TeluguStop.com

ఈ సినిమా రీమేక్‌కు ‘రభస’ ఫేం సంతోష్‌ శ్రీనివాస్‌ దర్శకత్వం వహించనున్నాడు అంటూ ప్రచారం జరిగింది.అయితే ఆ వార్తలు కేవలం పుకార్లు మాత్రమే అని, ఇంకా రీమేక్‌పై ఒక స్పష్టత రాలేదు అంటూ తమిళ నిర్మాత రత్నం చెప్పుకొచ్చాడు.

‘వేదాళం’ చిత్రం రీమేక్‌లో పవన్‌ నటించే విషయంలో కూడా ఇంకా అధికారిక క్లారిటీ రావడం లేదు.నిర్మాత అధికారికంగా ఈ రీమేక్‌లో పవన్‌ నటించనున్నాడు అంటూ చెప్పకపోయినా కూడా, అనధికారికంగా మాత్రం పవన్‌తో సినిమా నిర్మించేందుకు ఆయన ఏర్పాట్లు చేస్తున్నాడు.

దర్శకుడు ఫిక్స్‌ కాలేదు అనే విషయాన్ని కూడా నిర్మాత పేర్కొన్నాడు.అతి త్వరలోనే ఈ సినిమా రీమేక్‌ పట్టాలెక్కే అవకాశాలున్నాయని తమిళ సినీ వర్గాల నుండి సమాచారం అందుతోంది.

ఏప్రిల్‌లో ‘సర్దార్‌ గబ్బర్‌సింగ్‌’ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తే ఆ తర్వాత మే లేదా జూన్‌లో ‘వేదాళం’ రీమేక్‌ను పవన్‌ ప్రారంభించే అవకాశాలున్నాయని పవన్‌ సన్నిహితులు చెబుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube