ప‌వ‌న్ దానికి ఒప్పుకుంటాడా?

కొంత‌మందికి కొంత క్రేజ్ ఉంటుంది.తెలుగులో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ ఏం చేసినా క్రేజే.

 Is Pawan Kalyan Singing A Song For Sardaar Gabbar Singh-TeluguStop.com

ఆయ‌న హెయిర్ స్టైల్ నుంచి చెప్పే డైలాగుల నుంచి, హ‌.హ‌.అనే మేన‌రిజ‌మ్ వ‌ర‌కు ప్ర‌తిదీ క్రేజే.ఈ జ‌న‌సేన పార్టీ అధ్యక్షుడు తాజాగా సర్దార్ గ‌బ్బ‌ర్‌సింగ్‌లో న‌టిస్తున్నారు.

ఈ సినిమా షూటింగ్ వ‌డోద‌ర‌లో జ‌రుగుతోంది.ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో పాటు కాజ‌ల్‌, బ్ర‌హ్మానందం కూడా ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నారు.

బాబీ (కె.ఎస్‌.ర‌వీంద్ర‌) ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమాను శ‌ర‌త్‌మ‌రార్ తెర‌కెక్కిస్తున్న విష‌యం తెలిసిందే.దేవిశ్రీ సంగీతాన్ని స‌మ‌కూరుస్తున్నారు.అన్ని పాట‌ల కంపోజింగ్ పూర్త‌యింద‌ట‌.ఒకే ఒక్క బిట్ సాంగ్ మాత్రం పెండింగ్ ఉంద‌ట‌.

ఆ పాట‌ను ప‌వ‌న్ క‌ల్యాణ్ పాడితే బావుంటుంద‌ని అటు దేవిశ్రీ ప్ర‌సాద్‌, ఇటు బాబీ కూడా ఆశ‌ప‌డుతున్నార‌ట‌.ఇటీవ‌ల అత్తారింటికిదారేది సినిమాలో కాట‌మ‌రాయుడా క‌దిరీన‌ర‌సింహుడా అనే పాట‌ను ప‌వ‌న్ క‌ల్యాణ్ పాడిన విష‌యం తెలిసిందే.

తెలుగు యాస‌ల‌పై ఆసక్తిని క‌న‌బ‌రిచే ప‌వ‌న్ క‌ల్యాణ్ ఈ సారి ఎలాంటి పాట‌ను పాడుతారో,, అది ఏ మాండ‌లికంలో ఉండ‌బోతోందో? అనేది అభిమానుల్లో ఉత్కంఠ‌త‌ను రేకెత్తుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube