దారుణం : సీమలో ఎన్టీఆర్ సినిమా లేదు - బాలకృష్ణ మాయం చేసాడా ?

‘నియంత ‘ – ‘ డిక్టేటర్ ‘ ఐన బాలకృష్ణ ఎన్టీఆర్ పాలిట అలాగే ప్రవర్తిస్తున్నాడు అంటున్నారు కొందరు.ఎన్టీఆర్ సినిమా రాయల సీమలో చాలా థియేటర్ లలో లేదు దీనికి కారణం బాలకృష్ణ అంటున్నారు చాలా మంది.

 Is Nannaku Prematho Washed Out In Rayalseema?-TeluguStop.com

ప్రత్యేకించి రాయలసీమ నాలుగు జిల్లాల్లో ఈ పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది.చాలా మండల కేంద్రాల్లో “నాన్నకు ప్రేమతో” జాడే లేకుండా పోయింది.

తొలి రోజు ఆడింది మాత్రమే ఆట.రెండో రోజున చాలా థియేటర్లలో “నాన్నకు ప్రేమతో” కనపడటం లేదు.దీంతో బాబాయ్ దెబ్బకు “నాన్నకు ప్రేమతో’ విలవిలలాడుతున్న పరిస్థితి కనిపిస్తోంది.వందల కొద్దీ థియేటర్ లు ఉన్నా కూడా ఎక్కడా నాన్నకు ప్రేమతో కనపడ్డం లేదు మొదటి రోజు మాత్రమే విడుదల అయ్యింది రెండవ రోజు అసలు సినిమానే కనపడ్డం లేదు.

అన్ని చోట్లా డిక్టేటర్ వచ్చేసింది.లేదంటే ఎక్స్ ప్రెస్ రాజా ఆడుతోంది.నాగార్జున సినిమాకో.శర్వానంద్ సినిమాకో అవకాశం ఇచ్చినా పర్వాలేదు.

ఎన్టీఆర్ సినిమాకు మాత్రం ఛాన్సివ్వకూడదన్నట్టుగా సాగించి సీమ లో ఈ సినిమాల పంచాయతీ.

ఏడెనిమిది థియేటర్లు ఉన్న పట్టణాల్లో కూడా వీలైనన్ని ఎక్కువ థియేటర్లను ఆక్రమించింది డిక్టేటర్.

మామూలుగా బాలయ్య సినిమాలు అన్ని థియేటర్లను విడుదల చేయరు.దీని వెనకాల తెలుగు దేశం నాయకులు ఉన్నారు అనీ వారి వెనకాల బాలకృష్ణ ఉన్నారు అనీ అంటున్నారు

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube