‘టెంపర్‌’లాగే ‘నాన్నకు ప్రేమతో’..!

ఎన్టీఆర్‌ ఈ సంవత్సరం ‘టెంపర్‌’ చిత్రంతో సూపర్‌ హిట్‌ను దక్కించుకున్న విషయం తెల్సిందే.పూరి జగన్నాధ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘టెంపర్‌’ సినిమా ఈ సంవత్సరం సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది.

 Is “nannaku Prematho” Follows “temper” Released Date?-TeluguStop.com

కాని కొన్ని అనివార్య కారణాల వల్ల సినిమాను ఫిబ్రవరిలో విడుదల చేయడం జరిగింది.‘టెంపర్‌’ విడుదల తర్వాత దాదాపు నాలుగు నెలలు గ్యాప్‌ తీసుకున్న ఎన్టీఆర్‌ సుకుమార్‌ దర్శకత్వంలో నాన్నకు ప్రేమతో చిత్రాన్ని ప్రారంభించాడు.

ప్రారంభం సమయంలోనే ‘నాన్నకు ప్రేమతో’ చిత్రాన్ని 2016లో సంక్రాంతి కానుకగా జనవరిలో విడుదల చేస్తాం అంటూ ప్రకటించారు.కాని ప్రస్తుత పరిస్థితు నేపథ్యంలో ‘టెంపర్‌’నే అనుసరించి సుకుమార్‌ సైతం వాయిదా వేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

సుకుమార్‌ ఇతరత్రా కారణాల వల్ల ‘నాన్నకు ప్రేమతో’ చిత్రం షూటింగ్‌ను ఆలస్యం చేశాడు.ఇప్పటికే షూటింగ్‌ దాదాపుగా పూర్తి అవ్వాల్సి ఉంది.

కాని కొన్ని కారణాల వల్ల సినిమా ఇంకా స్పెయిన్‌లో చిత్రీకరణ జరుపుకుంటూనే ఉంది.అయినా సరే సంక్రాంతికే విడుదల చేద్దాం అని భావించినా కూడా బాలకృష్ణ ‘డిక్టేటర్‌’ అడ్డు పడుతోంది.

సంక్రాంతికి ఎట్టి పరిస్థితుల్లో, నూటికి నూట ఒక్క శాతం సంక్రాంతికి ‘డిక్టేటర్‌’ చిత్రాన్ని విడుదల చేసి తీరుతాం అంటూ దర్శకుడు శ్రీవాస్‌తో బాలకృష్ణ పదే పదే ప్రకటింపజేస్తున్నాడు.దాంతో తప్పని పరిస్థితుల్లో ‘టెంపర్‌’ మాదిరిగా సంక్రాంతి రేసు నుండి తప్పుకుని ఫిబ్రవరిలో విడుదల అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడబోతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube