Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

  • WhatsApp

టీడీపీకి తార‌క్ అండ‌గా నిల‌వాల్సిందేనా..!-Is Jr NTR Campaigning For TDP In 2019 Elections

ఏపీలో 2019 ఎన్నిక‌ల్లో వ‌రుస‌గా రెండోసారి అధికారంలోకి రావ‌డం టీడీపీకి ప్ర‌తిష్టాత్మ‌కంగా మారింది. ఆ ఎన్నిక‌ల్లో టీడీపీ ఓడిపోతే సీనియ‌ర్ నేత‌గా ఉన్న చంద్ర‌బాబుకు త‌న‌క‌న్నా చాలా చాలా జూనియ‌ర్ అయిన జ‌గ‌న్ చేతుల్లో ఘోర ప‌రాజ‌యం కిందే లెక్క‌. ఇక ఫ‌స్ట్ టైం గెలిచి, సీఎం అయ్యేందుకు అటు జ‌గ‌న్‌, ఎలాగైనా రెండోసారి గెల‌వాల‌న్న క‌సితో ఇటు చంద్ర‌బాబు అధికారం కోసం ఎన్నో ఎత్తులు వేస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు మ‌రో 20 నెల‌ల టైం ఉన్నా ఏపీలో అప్పుడే రాజ‌కీయ ఎత్తులు, పై ఎత్తులు స్టార్ట్ అయ్యాయి.

జ‌గ‌న్‌కు అధికారం కావాలి…ఇందుకోసం ఏదైనా చేసేందుకు రెడీగా ఉన్నాడు. ఇప్ప‌టికే క‌మ్యూనిస్టుల‌తో పొత్తుకు రెడీ అంటున్నాడు. పీకే దెబ్బ‌తో చాలా వ‌ర‌కు మారుతున్నాడు. అవ‌స‌ర‌మైతే జ‌న‌సేన‌తో పొత్తుకు సైతం ఓకే అంటున్నాడు. ప‌వ‌న్ జ‌గ‌న్‌తో క‌లిసేందుకు ఓకే అంటాడా ? లేదా ? అన్న‌ది త‌ర్వాత సంగ‌తి. మ‌రి వైసీపీకి అటు క‌మ్యూనిస్టులు, ఇటు ప‌వ‌న్ తోడైతే అప్పుడు టీడీపీ పరిస్థితి ఏంటి ? ఈ విష‌యం చంద్ర‌బాబుకు తెలియంది కాదుగా…అందుకే అపర రాజ‌కీయ చాణుక్యుడిగా పేరున్న చంద్ర‌బాబు అప్పుడే త‌న రాజ‌కీయ వ్యూహం స్టార్ట్ చేసేసిన‌ట్టు టీడీపీలోని విశ్వ‌స‌నీయ‌వ‌ర్గాల ద్వారా తెలుస్తోంది.

Continue Reading
To Top