జ‌గ‌న్ - బీజేపీ డీల్ ఇదేనా..?

ఏపీలో గ‌త ప‌ది రోజులుగా జ‌రుగుతోన్న రాజ‌కీయ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తోన్న వారు టీడీపీ-బీజేపీ పొత్తు త్వరలోనే విచ్ఛిన్నం అవుతుందనే ఊహాగానాలు ఏ స్థాయిలో ఉన్నాయో.వచ్చే ఎన్నికల్లో బీజేపీ వైసీపీతో క‌లిసి వెళ్లే సూచ‌న‌లు ఉన్నాయ‌న్న చ‌ర్చ‌లు కూడా అంతే స్థాయిలో జ‌రుగుతున్నాయి.

 Is It Ys Jagan And Bjp Deal-TeluguStop.com

ఇప్పుడు చంద్ర‌బాబు-బీజేపీ మ‌ధ్య ఏ విష‌యం చూడాల‌న్నా రాం మాధ‌వే చూడాలి.వెంక‌య్య లేక‌పోవ‌డంతో టీడీపీ-బీజేపీ మ‌ధ్య దూరం పెరిగిపోతుంద‌న్న‌ది ప్ర‌తి ఒక్క‌రికి అర్థ‌మ‌వుతోంది.

ఇక రాం మాధ‌వ్ సూత్రం బీజేపీకి గ‌రిష్టం లాభం ఎవ‌రితో ఉంటే వాళ్ల‌తోనే ముందుకు వెళ్లడం.ఈ క్ర‌మంలోనే వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీతో పొత్తు పెట్టుకుంటే త‌మ‌కు వ‌చ్చే గ‌రిష్ట లాభంపై రాం మాధ‌వ్, సోము వీర్రాజు త‌దిత‌రులు ఇప్ప‌టికే ఓ డెసిష‌న్‌కు వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది.

గ‌త ఎన్నిక‌ల్లో బీజేపీకి ఏపీలో టీడీపీకి కేవ‌లం 4 ఎంపీ సీట్లు మాత్ర‌మే ఇచ్చింది.వీటిల్లో న‌రసాపురం, విశాఖ‌లో గెలిచిన బీజేపీ, తిరుప‌తి, రాజంపేట‌లో ఓడిపోయింది.

ఇదిలా ఉంటే నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న జ‌రిగే సూచ‌న‌లు లేక‌పోవ‌డంతో టీడీపీ, బీజేపీకి ఇంత‌కు మించి సీట్లు ఇచ్చే ప‌రిస్థితి లేదు.ఈ క్ర‌మంలోనే బీజేపీ టీడీపీతో క‌లిసి వెళ్ల‌డం కంటే ఇంత‌క‌న్నా మంచి ఆఫ‌ర్ ఇస్తే వైసీపీతోనే క‌లిసి వెళ్లేందుకు సుముఖంగా ఉన్న‌ట్టు తెలుస్తోంది.

బీజేపీ ఏపీలో సొంతంగా పోటీ చేసే సాహసం చేయదు.అయితే టీడీపీతో అయినా క‌లిసి వెళ్లాలి…లేక‌పోతే వైసీపీతో అయినా క‌ల‌వాలి.

వైసీపీతో క‌లిస్తే బీజేపీ ఏకంగా 10-12 ఎంపీ సీట్లు కోరే అవ‌కాశం ఉన్న‌ట్టు తెలుస్తోంది.ఈ రేంజ్‌లో ఎంపీ సీట్ల‌తో పాటు 30-35 అసెంబ్లీ సీట్ల‌ను కూడా బీజేపీ డిమాండ్ చేయ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.

ఎమ్మెల్యే సీట్లు ఎలా ఉన్నా ఎంపీ సీట్ల‌ను కాస్త ఎక్కువ‌గానే ఇచ్చేందుకు వైసీపీ నుంచి సానుకూల సంకేతాలు వెలువ‌డుతున్న‌ట్టు తెలుస్తోంది.

బీజేపీతో జ‌గ‌న్ కూడా పొత్తుకు ఇంట్ర‌స్టింగ్‌గానే ఉన్నాడు.

ఆ పార్టీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి జ‌గ‌న్‌ను బీజేపీకి ద‌గ్గ‌ర చేసేందుకు విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.జ‌గ‌న్ టీడీపీ-బీజేపీ పొత్త ఎప్పుడు బ్రేక‌ప్ అవుతుందా ? ఆ వెంట‌నే ఎన్డీయేలో దూరేద్దామ‌ని చూస్తున్నారు.మ‌రి ఫ్యూచ‌ర్‌లో ఏపీ రాజ‌కీయాలు ఎలా ? మార‌తాయో ? చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube