Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

జ‌గ‌న్ - బీజేపీ డీల్ ఇదేనా..?-Is It Ys Jagan And BJP Deal

ఏపీలో గ‌త ప‌ది రోజులుగా జ‌రుగుతోన్న రాజ‌కీయ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తోన్న వారు టీడీపీ-బీజేపీ పొత్తు త్వరలోనే విచ్ఛిన్నం అవుతుందనే ఊహాగానాలు ఏ స్థాయిలో ఉన్నాయో..వచ్చే ఎన్నికల్లో బీజేపీ వైసీపీతో క‌లిసి వెళ్లే సూచ‌న‌లు ఉన్నాయ‌న్న చ‌ర్చ‌లు కూడా అంతే స్థాయిలో జ‌రుగుతున్నాయి. ఇప్పుడు చంద్ర‌బాబు-బీజేపీ మ‌ధ్య ఏ విష‌యం చూడాల‌న్నా రాం మాధ‌వే చూడాలి. వెంక‌య్య లేక‌పోవ‌డంతో టీడీపీ-బీజేపీ మ‌ధ్య దూరం పెరిగిపోతుంద‌న్న‌ది ప్ర‌తి ఒక్క‌రికి అర్థ‌మ‌వుతోంది.

ఇక రాం మాధ‌వ్ సూత్రం బీజేపీకి గ‌రిష్టం లాభం ఎవ‌రితో ఉంటే వాళ్ల‌తోనే ముందుకు వెళ్లడం. ఈ క్ర‌మంలోనే వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీతో పొత్తు పెట్టుకుంటే త‌మ‌కు వ‌చ్చే గ‌రిష్ట లాభంపై రాం మాధ‌వ్, సోము వీర్రాజు త‌దిత‌రులు ఇప్ప‌టికే ఓ డెసిష‌న్‌కు వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. గ‌త ఎన్నిక‌ల్లో బీజేపీకి ఏపీలో టీడీపీకి కేవ‌లం 4 ఎంపీ సీట్లు మాత్ర‌మే ఇచ్చింది. వీటిల్లో న‌రసాపురం, విశాఖ‌లో గెలిచిన బీజేపీ, తిరుప‌తి, రాజంపేట‌లో ఓడిపోయింది.

Continue Reading
More Posts
To Top