చెడగొట్టేస్తున్న చిరంజీవి?-Is Chiranjeevi Spoiling The Original With Khaidi No.150 ? 3 months

Director VV Vinayak Kaththi Remake Khaidi No.150 Megastar Chiranjeevi చెడగొట్టేస్తున్న చిరంజీవి? Photo,Image,Pics-

ఏఆర్ మురుగదాస్ తమిళంలో తీసిన కత్తి చిత్రాన్ని ఇక్కడ ఎంతమంది చూసుంటారో కాని, చాలావరకు హీరో విజయ్ ని విజయ్ లా కాకుండా సినిమాలో బలమైన పాత్రగా చూపించారు ఏఆర్ మురుగదాస్. తన ఫ్యాన్ ఫాలోయింగ్, మాస్ అపీల్, అన్నిటిని పక్కనపెట్టి ఓ స్టార్ హీరో ఇలాంటి సన్నివేశాలు చేస్తాడా అనేంతగా ఆశ్చర్యపరిచాడు విజయ్. ఇప్పుడు ఓ కమర్షియల్ క్లాసిక్ అయిన కత్తి చిత్రాన్ని తన 150వ సినిమాగా ఎంచుకున్నారు చిరంజీవి.

పాత్రలో లీనమై, దర్శకుడిని, కథని బలంగా నమ్మి, విజయ్ చేసిన కొన్ని సన్నివేశాలు ఇప్పుడు మన మెగస్టార్ చేయలేరని కాదు, చేయరని కాదు. అలాగని చేస్తున్నారో, చేయట్లేదు సినిమా చచ్చేదాకా మనకు తెలియదు. పీక్ స్టార్ డమ్ లోనే స్వయంకృషి అంటూ చెప్పులు కుట్టేవాడి పాత్ర చేసిన సాహసం, ఘనత ఆయనవి. కాని అప్పటికి ఇప్పటికీ కమర్షియల్ ట్రెండ్ మారింది. అందుకే చిరంజీవి కూడా మారారేమో అనిపిస్తోంది.

ఖైదీ నం.150లో కత్తిలో ఉన్న అన్ని సన్నివేశాలు ఉండవని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇంటర్వెల్ కి ముందు వచ్చే ఒకటిరెండు సన్నివేశాల్లో మార్పులు చేసారని, ఇదంతా చిరంజీవి అభిమానుల కోసమే అని టాక్. రీమేక్ ని ఉన్నది ఉన్నట్టుగానే తీయాల్సిన అవసరం లేదు. అందుకే ఓ ఐటమ్ సాంగ్ కూడా జతచేస్తున్నారు. మళయాళంలో ప్రేమమ్ కి స్వల్పంగా మార్పులు చేసి, తెలుగులో కొంచెం కామెడీ జతచేసి తీసినా, ఓ క్లాసిక్ ని మాత్రం చెడకొట్టలేదు నాగచైతన్య – చందూ మొండేటి. మరి చిరంజీవి – వినాయక్ ఏం చేస్తున్నారో!

మీ కోసం సూచించబడిన ఈ స్పెషల్ స్టోరీ చూడండి.. తమిళ హీరోలకి ఉన్న ధైర్యం తెలుగు హీరోలకి లేదా ?

About This Post..చెడగొట్టేస్తున్న చిరంజీవి?

This Post provides detail information about చెడగొట్టేస్తున్న చిరంజీవి? was published and last updated on in thlagu language in category Telugu Movie News,Telugu News.

Megastar Chiranjeevi, Khaidi No.150, Changes in original Story, kaththi remake, Director vv vinayak, చెడగొట్టేస్తున్న చిరంజీవి?

Tagged with:Megastar Chiranjeevi, Khaidi No.150, Changes in original Story, kaththi remake, Director vv vinayak, చెడగొట్టేస్తున్న చిరంజీవి?Changes in original Story,Director VV Vinayak,Kaththi remake,Khaidi No.150,Megastar Chiranjeevi,చెడగొట్టేస్తున్న చిరంజీవి?,,