9వ నెలలో గర్భిణికి అవసరమైన ఆహారాలు

గర్భం పొందిన ప్రతి మహిళకి తొమ్మిదొవ నెల చాలా ప్రత్యేకం.బిడ్డ పూర్తిగా ఎదిగిపోయి ఉంటుంది.

 Foods For 9th Month In Pregnancy-TeluguStop.com

ఆ పసికందు ఎప్పుడు తన కళ్ళ ఎదుట పడుతుందా అని ఆతృతగా ఎదురుచూస్తూ ఉంటుంది తల్లి.ఆమె మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటుంది.

బిడ్డ మీద బెంగ, భయం పెట్టుకోవడం వలన ఇలా జరుగుతుంది.అలాగే శారీరక ఒత్తిడి కూడా పెరుగుతుంది.

ఒక్కసారిగా ఆమె బరువు పెరగడంతో మెటబాలిజం రేటు మీద ఆ బరువు ప్రభావం చూపుతుంది.అందుకే తొమ్మిదొవ నెలలో ఆమె ఇంకా జాగ్రత్తగా ఉండాలి.

ఇంకా మంచి డైట్ పాటించాలి.

* ఇలాంటి సమయంలో తల్లి శరీరంలో రక్తం బాగా ఉత్పత్తి అవుతూ ఉండాలి.

రక్తలేమి సమస్య ఉంటే ఆ ఒత్తిడిని ఆమె తట్టుకోవడం దాదాపు అసాధ్యం.అందుకే ఐరన్ ఎక్కువగా లభించే ఆహారపదార్థాలతో పాటు ప్రోటీన్ తీసుకోవాలి.

క్యారట్, బీట్ రూట్, చికెన్ (మసాల, ఫ్రై వద్దు), డ్రై ఫ్రూట్స్, బెర్రిలు, పచ్చి బటానీలు, ఎగ్ వైట్, పాలకూర తీసుకోవాలి.* తృణధాన్యాలతో చేసిన బ్రెడ్ తినిపిస్తే మంచిది.

ఈ సమయంలో వైట్ రైస్ కి బదులు తృణధాన్యాలతో చేసిన ఆహారపధార్థాలు తినిపియడమే మంచి ఆప్షన్.

* అమె డెలివరీ దగ్గరలో ఉంది.

ఇలాంటి సమయంలో ఎముకలు చాలా బలంగా ఉండాలి.అవి శక్తిని అందుకోవాలంటే శరీరంలోకి కాల్షియం చేరాలి.

అంటే కాల్షియం బాగా దొరికే బ్రొకోలి, పాలు, పెరుగు, ఓట్స్, బాదం తినాలి.

* మెటబాలిజంలో తేడాలొస్తాయి అని చెప్పాం కదా.మెటబాలిజం రేటు స్టడీగా ఉండాలంటే ఫైబర్ చాలా అవసరం.అందుకోసం ఫైబర్ బాగా దొరికే ఆపిల్, ఖర్జూరా, బ్రోకొలి, పీస్, బీన్స్, అవకాడో తీసుకోవాలి.

* విటమిన్ ఏ ఆమెకి అవసరం.అందుకోసం డార్క్ గ్రీన్ వెజిటబుల్స్ ని డైట్ లోకి తీసుకురండి.

క్యారట్ తినిపించండి.బిడ్డ పుట్టుక లోపాలతో ఉండకుండా ఫోలిక్ ఆసిడ్ ఉన్న ఆహారాలు, అంటే డార్క్ గ్రీన్ వెజిటబుల్స్, స్పినాబిఫోడా, బీన్స్ అవసరం.

విటమిన్ సి కూడా ఆమె శరీరానికి అవసరం.కాలిఫ్లవర్, ఆరెంజ్, నిమ్మ, బ్రికోలి, స్ట్రాబెరిలో విటమిన్ సి బాగా దొరుకుతుంది.

* ఇక మంచినీళ్ళు బాగా తాగి శరీరాన్ని ఎప్పుడు హైడ్రేటెడ్ గా ఉంచుకోవాలి.రోజు ఒకే ఆహారాన్ని తినకుండా, ఇప్పుడు చెప్పిన డైట్ లో ఆహార పదార్థాలు మార్చి మార్చి తినటం బెటర్.

స్వీట్స్ కి, కూల్ డ్రింక్స్ కి, మసాలా ఉండే ఆహార పదార్థాలకి దూరంగా ఉండటం మంచిది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube