ఐపీఎల్ గుట్టు రట్టు అయింది

ఈ సీజన్ ఐపీఎల్ లో ఎక్కువగా భారీ స్కోర్లు నమోదు కావడం లేదు.ఇప్పటివరకు 14 మ్యాచ్ లు జరుగగా కేవలం 4 మ్యాచ్ లలో మాత్రమే భారీ స్కోర్లు నమోదయ్యాయి.అందులో మూడు మ్యాచ్ లు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆడిన మ్యాచ్ లు కావడమే విశేషం.అయితే ఈ ఐపీఎల్ సీజన్లో విజయం దక్కించుకోవాలంటే రహస్యమేంటో జట్లకు తెలిసిపోయింది.

 Ipl Secret Leaked-TeluguStop.com

ముంబై – బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్ తో కలిపి 14 మ్యాచ్ లు ఆడగా, 13 మ్యాచ్ లలో చేజింగ్ జట్టు లక్ష్యాన్ని అందుకుని విజయాన్ని సొంతం చేసుకున్నాయి.మిగిలిన ఆ ఒక్క మ్యాచ్ కూడా బెంగుళూరు జట్టు తొలుత బ్యాటింగ్ చేసి ఏకంగా 200పై చిలుకు పరుగులు చేయడంతో విజయం వశమైంది.

అంటే ఈ సీజన్లో విజయం దక్కించుకోవాలంటే తొలుత బ్యాటింగ్ చేస్తే… 200 పరుగులు దాటాలి… లేదంటే లక్ష్యాన్ని చేధించాలి.మరో విశేషమేమిటంటే… భారీ లక్ష్యాలు కూడా అవలీలగా అందుకున్నారు.

బెంగుళూరు అందించిన 191, 171 పరుగుల లక్ష్యాలను ప్రత్యర్ధి జట్లు అవలీలగా అందుకోవడం చూస్తుంటే… ఏ జట్టైనా టాస్ గెలవగానే మరో ఆలోచనకు ఆస్కారం లేకుండా బౌలింగ్ ఎంచుకుంటుందని చెప్పవచ్చు.అంటే టాస్ గెలిస్తే… దాదాపు మ్యాచ్ గెలిచినట్టే.

ఇప్పటివరకు అయితే ఇదే ట్రెండ్ కొనసాగుతోంది… మరి ఈ ట్రెండ్ ను ఏ జట్టు మారుస్తుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube