Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

ఇంట్లో దెయ్యం నాకేం భయం మూవీ రివ్యూ -Intlo Deyyam Nakem Bhayam Movie Review Intlo Deyyam Nakem Bhayam,Intlo Deyyam Nakem Bhayam First Day Talk,Intlo Deyyam Nakem Bhayam Movie Collections,Intlo Deyyam Nakem Bhayam Movie Review,Krithika Jayakumar

చిత్రం : ఇంట్లో దెయ్యం నాకేం భయం
బ్యానర్ : శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర
దర్శకత్వం : జి. నాగేశ్వర్ రెడ్డి
నిర్మాత : బివిఎస్ఎన్ ప్రసాద్
సంగీతం : సాయి కార్తిక్
విడుదల తేది : డిసెంబర్ 30, 2016
నటీనటులు : అల్లరి నరేష్, కృతిక జయకుమార్, రాజేంద్రప్రసాద్

అల్లరి నరేష్ – జీ. నాగేశ్వర్ రెడ్టి కాంబినేషన్ లో ఇంతకుముందు సీమ శాస్త్రీ, సీమటపాకాయ్ లాంటి హిట్ సినిమాలు వచ్చాయి. అందుకే ఆ కాంబినేషన్ తో ఎప్పుడు పెద్ద సినిమాలే నిర్మించే బివిఎస్ఎన్ ప్రసాద్ ఓ ప్రయత్నంగా చిన్న సినిమా నిర్మించారు. ఆ ప్రయాత్నం ఫలించిందో లేదో చూద్దాం.

కథలోకి వెళితే :

ఒక విలువైన భవనం, అందులో తిష్ఠ వేసుకోని కూర్చున్న ఓ దెయ్యం. ఆ ఇల్లు ఫ్లాష్ బ్యాక్ తెలియక, ఇల్లు కొనేస్తాడు రాజేంద్రప్రసాద్. మరోవైపు బ్యాండ్ మేలం నడుపుతూ, ఓ అందమైన అమ్మాయి ఇందుమతి (కృతిక జయకుమార్) ని పడేస్తాడు నరేష్ (అల్లరి నరేష్).
ఓ సందర్భంలో తన ఇంట్లో దెయ్యం ఉందని రాజేంద్రప్రసాద్ కి తెలిసిపోతుంది. అది పెట్టే తిప్పలు పడలేక భూత మాంత్రికుడికి ఫోన్ చేయాల్సింది, నరేష్ కి ఫోన్ చేస్తాడు. రెండు కారణాలవల్ల డబ్బు అవసరంలో ఉన్న నరేష్, భూతవైద్యుడి లాగే బిల్డప్ ఇస్తూ, 10 లక్షల రూపాయలిస్తే దెయ్యాన్ని వెళ్ళగొడతాని డీల్ కుదుర్చుకుంటాడు.
కట్ చేస్తే దెయ్యం ఈ నకిలీ భూతవైద్యుడికి, రాజేంద్రప్రసాద్ కుటుంబానికి చుక్కలు చూపిస్తూ ఉంటుంది. మళ్ళీ కట్ చేస్తే ఆ దెయ్యానికి, నరేష్ కి సంబంధం ఉందని తెలుస్తుంది. మళ్ళీ కట్ చేస్తే ఏం జరిగి ఉంటుందో మీకు తెలుసు.

నటీనటుల నటన :

టీవి సీరియల్స్‌ ని తలపించే ఓవర్ యాక్షన్, అరిగిపోయిన తెలుగు సినిమాని తలపించే అసహజ అభినయం అందరిలో కనబడింది. మరో సినిమాలో మరోసారి, తన స్టయిల్లో అల్లరి నరేష్ కనిపించాడు అంతే. కొత్తగా చేయడానికి కథలో ఏమి లేక, రాజేంద్రప్రసాద్ గారు కూడా మెప్పించలేకపోయారు. దృశ్యం సినిమాలో అమాయకంగా కనిపించే కృతిక, ఇందులో చాలా గ్లామరస్ గా కనిపించింది.
కొత్త అమ్మాయి (పేరు తెలియదు), దెయ్యంలా భయపెట్టడానికి విశ్వప్రయత్నాలు చేసింది. జబర్దస్త్ బ్యాచ్ నవ్వించటానికి ప్రయత్నాలు చేసారు.

సాంకేతిక వర్గం పనితీరు :

కథలో కంటెంట్ ఉంటే దానికి తగ్గట్టుగా పనిచేస్తుంది సాంకేతిక బృందం. కొత్తదనం ఉంటే ప్రతీ క్రాఫ్ట్ కొత్తగా పనిచేస్తుంది. ఇందులో అలాంటి అద్భుతాలు లేవు. ఏ డిపార్టుమెంటు గురించి పెద్దగా మాట్లాడుకోవటానికి లేదు. ప్రేమకథాచిత్రమ్ నుంచి ఇప్పటికి వరకు ఎన్ని హర్రర్ కామెడి సినిమాలు వచ్చాయో .. అరిగిపోయిన కథని పట్టుకోని ఏం లాగామంటారు టెక్నిషియన్స్ ని మాత్రం . సాయి కార్తిక్ సంగీతం, ఈ బడ్జెట్ సినిమాలతో పోల్చుకుంటే, ఫర్వాలేదు.

విశ్లేషణ :

హీరోయిన్ నడుముకి క్లోజప్ షాట్ పెట్టి ఇంట్రడ్యూస్ చేస్తారు. ఎన్ని సినిమాల్లో ఇలా ? ఇందుకు కాదు, తెలుగులో హీరోయిన్ పాత్రలు బాగుండట్లేదు అని విమర్శకులు మొత్తుకునేది. పాటకు సందర్భం ఉండదు కాని కాసేపు నరేష్ డ్యాన్సులు, కృతిక అందాలు వాడుకోవటానికి పాట వస్తుంది. అలా కృతిక గ్లామర్ డోసు, మధ్యలోమధ్యలో జబర్దస్త్ బ్యాచ్ అరిగిపోయిన కామెడీతో 2010 కి ముందు వచ్చిన చాలా తెలుగు సినిమాల్లో లాగా వెళ్ళిపోతుంది ఫస్టాఫ్.
సెకండాఫ్ లో ఏదైనా ఇంటరెస్టింగ్ ఎలిమెంట్ ఉంటుందేమో, దెయ్యం కథని కాస్తైనా కొత్తగా తీయకపోతారా అని పుట్టిన అత్యాశ, సెకండాఫ్ సెకండ్ సీన్ కి ఖూనీ అయిపోతుంది. దెయ్యం 90% తెలుగు సినిమాల్లో ఒకేరకంగా ఎందుకు చనిపోతుందో ఇప్పటికి అర్థం కాదు. ఈకాలంలో, కొత్త పంథాలోకి తెలుగు సినిమా ఇప్పుడిప్పుడే వెళుతున్న సమయంలో, ఇంట్లో దెయ్యం నాకేం భయం అనే సినిమా ఇలా ఎందుకు తీసారో అస్సలు అర్థం కాదు.
మాస్ కామెడీ ఇష్టపడే ప్రేక్షకులు ఎంజాయ్ చేయవచ్చు ఏమో, సినిమాను మోస్తే వాళ్ళే మోయాలి.

ప్లస్ పాయింట్స్ :
* కొంత మాస్ కామెడీ, కొంత కృతిక గ్లామర్ (మాస్ ప్రేక్షకుల కోసం).

* మైనస్ పాయింట్స్ :
* విరిగి, నలిగి, అరిగిపోయిన కథ
* పేలని కామెడీ
* 2010, అంతకుముందు వచ్చిన కామెడీ సినిమాల వాసన

తెలుగుస్టాప్ రేటింగ్ :1.5/5

Continue Reading
More Posts
To Top