నిద్ర గురించి మీకు తెలియని నిజాలు

నిద్రలో ఏం జరుగుతోందో మనకు సాధారణంగా తెలియదు.అలాగే నిద్ర గురించి కూడా కొన్ని గమ్మత్తయిన నిజాలు తెలియకపోవచ్చు.

 Interesting Facts About Sleep-TeluguStop.com

మరి ఆలస్యం ఎందుకు .వాటిలో కొన్ని చదివి తెలుసుకోండి.

* సాధారణంగా రాత్రిపూట నిద్రపట్టడానికి 10-15 నిమిషాలు పట్టాలి.అంతకంటే తక్కువ సమయంలో నిద్రపట్టేస్తే మీరు అలసిపోయారని అర్థం.ఆలస్యం జరుగితే మీకు నిద్ర రావట్లేదని అర్థం.

* ఒక పిల్లి జీవితంలో 2/3 భాగం నిద్రలోనే గడిచిపోతుందట.

* 264.4 గంటల పాటు నిద్రపోకుండా ఉన్నాడు ఓ హై స్కూలు స్టూడెంట్.ఇదో రికార్డు.

* పసికందులు ఎక్కువగా REM-SLEEP లో ఉంటారు.

* ఒక జిరాఫీకి రోజులో 1.9 గంటల నిద్ర మాత్రమే అవసరం.అదే ఒక బ్రౌన్ బ్యాట్ కి 19.9 గంటల నిద్ర అవసరం.

* ప్రపంచ జనాభాలో 15% మందికి నిద్రలో నడిచే అలవాటు ఉంది.

* నిద్రను వాయిదా వేయడం కేవలం మనుషులు చేయగలుగే పని.

* నిద్రలో కూడా కొంచెం యాక్టివ్ గా ఉండే మన మెదడు, ఆ సమయంలో టాక్సీన్స్ ని కూడా క్లియర్ చేస్తుందని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి.

* ఈ ప్రపంచంలో నిద్రలేమితో బాధపడేవారికన్నా, గురకతో ఇబ్బందిపడే వారి సంఖ్యే ఎక్కువ.

* మధ్యాహ్నం నిద్ర మంచిదే అయినా, గంట-గంటన్నరలో నిద్రను ముగించాలని పరిశోధకులు చెబుతారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube