మొటిమల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోండి

మొటిమలు … ఈ పేరుని ప్రపంచంలో ఇష్టపడే వ్యక్తులు అస్సలు ఉండరేమో.టీనేజ్ లో మొదలయ్యి, యవ్వనం పూర్తిగా దాటేవరకు, కొంతమందిని దాటిన తరువాత కూడా ఇబ్బంది పెట్టే ఈ మొటిమల్ని మీరు అసహ్యించుకున్నా సరే, వాటి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోండి.

 Interesting Facts About Pimples-TeluguStop.com

ఎందుకంటే నేర్చుకున్న విషయాలు మీకే ఉపయోగపడతాయి.

* అమెరికాలో దాదాపు 50 మిలియన్ల మంది మొటమలతో బాధపడుతున్నారట.

* కేవలం టీనేజ్ లేదా యవ్వనంలోనే మొటిమలు వస్తాయి అనుకుంటే పొరపాటే.అమెరికన్ అకాడెమి ఆఫ్ డెర్మటాలజి ప్రకారం 30-50 ఏళ్ళ వయసులో కూడా మొటిమలు రావొచ్చు.

* ఆయిల్ స్కిన్ ఉంది కదా రోజంతా ముఖం కడిగేసుకుంటే మొటిమలు తగ్గుతాయనుకుంటున్నారా? ముఖాన్ని అతిగా కడిగితే అది మొటిమలకి సహాయమే చేయవచ్చు.రోజుకి రెండుసార్లు ముఖం కడుక్కుంటే చాలు.

* మొటిమలను కంట్రోల్ చేయడానికి అతిగా మందులు వాడితే మొటిమలు ఇంకా పెరగొచ్చు.

* మొటిమల కోసం తయారుచేసిన కొన్నిరకాల మందులు (అన్ని కాదు) గర్భిణీ స్త్రీలు వాడితే, కడుపులో బిడ్డ అయితే చనిపోవచ్చు లేదా ఏదైనా లోపంతో పుట్టొచ్చు.

* సూర్యరశ్మి మొటిమల బాధను ఇంకా పెంచవచ్చు.మొటిమలతో బాధపడుతూ, రోజుకి 20 నిమిషాల కన్నా ఎక్కువ ఎండలో గడిపితే అంతే సంగతులు.

* ఆర్గానిక్, నేచురల్ ఫుడ్స్ అన్ని మొటిమలకి మంచివి కావు.కొన్నిరకాల సహజమైన ఆహారం కూడా మొటిమల బాధను పెంచవచ్చు.

* గర్భనిరోధక మాత్రలు కూడా మొటిమలకు కారణం కావచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube