ఫేస్ బుక్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు

ఫిబ్రవరి 4, 2004 నాడు తన స్నేహితులతో కలిసి ఫేస్ బుక్ ని స్థాపించినప్పుడు మార్క్ జూకర్ బర్గ్ అనుకోలేదేమో ఈరోజు ఫేస్ బుక్ సోషల్ నెట్వర్కింగ్ రంగాన్ని మకుటం లేని మహారాజు లాగా శాసిస్తుందని.ట్విట్టర్ లాంటి క్వాలిటి సోషల్ నెట్వర్కింగ్ సైట్ పోటీలో ఉన్నా, ఫేస్ బుక్ కి ఆదరణ తగ్గలేదు.

 Interesting Facts About Facebook-TeluguStop.com

నేడు మన దేశంలోని మారుమూల ప్రాంతాలకి కూడా చేరుకున్న ఫేస్ బుక్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోండి.

* ఫేస్ బుక్ లో మొదటి మూడు ఎకౌంట్లు క్రియేట్ చేసింది మార్క్ జూకర్ బర్గ్.

కాని ఆ మూడు ఖాతాలు ఇప్పుడు లేవు.

* ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జూకర్ బర్గ్ కి ఎరుపు, గ్రీన్ రంగులు సరిగా కనిపించవు.

ఫేస్ బుక్ కలర్ బ్లూలో ఉండటానికి ఇది కూడా ఓ కారణం.

* ఇప్పుడున్న లైక్ బటన్ మొదటగా AWESOME పేరుతో ఉండేది.2007లో దీన్ని Like కి మార్చేసారు.

* ఫేస్ బుక్ యూజర్ల జనాభా ముందు చైనా, భారత్ కూడా చిన్నబోవాల్సిందే.

ఎందుకంటే ఫేస్ బుక్ వినియోగదారుల సంఖ్య 170 కోట్లు దాటింది.

* ఫేస్ బుక్ రెవెన్యూ అక్షరాల 17.928 బిలియన్ డాలర్లు.మొత్తం ఆస్తులు 49.407 బిలియన్ డాలర్లు.

* ప్రపంచంలో అత్యధిక ఫేస్ బుక్ లైక్స్ ఉన్న సెలబ్రటీ ఫుట్ బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో.11 కోట్ల 60 లక్షలకు పైగా లైక్స్ ఇతని పేజ్ కి ఉన్నాయి.

* భారతదేశంలో అత్యధిక లైక్స్ ప్రధాని నరేంద్ర మోడి పేజ్ కి ఉన్నాయి.3 కోట్ల 60 లక్షలకి పైగా లైక్స్ మన ప్రధాని సొంతం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube