అతినిద్ర, నిద్రలేమి వలన ఈ జబ్బు రావొచ్చు

మనిషి శరీరానికి నిద్ర అత్యవసరం.రోజంతా పనిచేసి అలిసిపోయిన శరీరానికి విశ్రాంతినివ్వడమే నిద్ర.

 Insomnia And Excess Sleep … Both Can Cause Diabetes In Men-TeluguStop.com

అయితే నిద్ర అనేది అవసరానికి తగ్గకూడదు, అలాగే అవసరానికి మించి ఉండకూడదు.నిద్రలేమితో పాటు అతినిద్ర కూడా సమస్యే.జర్నల్ ఆఫ్ క్లినికల్ ఎండోక్రినోలజి కథనం ప్రకారం మగవారిలో అతినిద్రతో పాటు నిద్రలేమి వలన డయాబెటిస్ వస్తుందట.

30-60 సంవత్సరాల వయసు మధ్యలో ఉన్న 780 మంది మగవారిపై జరిగిన ఒక ఆధ్యనంలో ఈ విషయం బయటపడింది.సగటున 7-8 గంటల నిద్రపోతున్న మగవారి కంటే తక్కువ సమయం నిద్రపోతున్న మగవారిలో లేదా ఎక్కువ సమయం నిద్రపోతున్న మగవారిలో బ్లడ్ షుగర్ లెవెల్స్ గణనీయంగా పెరగటం గమనించారు పరిశోధకులు.

” మగవారు ఎక్కువగా నిద్రపోయినా, తక్కువ సమయం నిద్రపోయినా బాడి సెల్స్ ఇన్సులీన్ కి తక్కువగా రెస్పాండ్ అవడం జరుగుతోంది.దీని వలన డయాబెటిస్ వచ్చే అవకాశం చాలా పెరిగిపోతుంది.మనిషి ఆరోగ్యంగా ఉన్నా, అతినిద్ర లేదా నిద్రలేమి మంచిది కాదు” అంటూ ఫెమ్కే రట్టర్స్ అనే పరిశోధకుడు వాఖ్యానించారు.

కాబట్టి శరీరానికి నిద్ర కూడా సరిపోయేంత వరకు మాత్రమే ఇవ్వాలి లేదా సరిపోయేదాకా ఇవ్వాలి.అతినిద్ర, నిద్రలేమి .రెండూ ప్రమాదకరమే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube