టీఆర్ ఎస్‌లో వార‌స‌త్వ చ‌ర్చ‌!

తెలంగాణ అధికార పార్టీ టీఆర్ ఎస్ వార‌స‌త్వం గురించి ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌రుగుతోంది.గ‌తంలోనూ ఈ చ‌ర్చ వ‌చ్చినా.

 Inheritance Troubles In Trs Party-TeluguStop.com

ఎవ‌రూ పెద్దగా ప్రాధాన్యం ఇవ్వ‌లేదు.అయితే, ఇప్పుడు పొరుగున ఉన్న త‌మిళ‌నాడులో అధికార అన్నాడీఎంకే పార్టీ అధినేత్రి మ‌ర‌ణంతో ఆ పార్టీ ప‌గ్గాల విష‌యంలో పెద్ద సందేహాలు, అనుమానాలు వ‌స్తున్నాయి.

మ‌రి ఈ క్ర‌మంలోనే ఏమో చెప్ప‌లేం కానీ, ఇక్క‌డ తెలంగాణ‌లోనూ టీఆర్ ఎస్ పార్టీ ప‌గ్గాలపై, వార‌సుల‌పై పెద్ద ఎత్తున చ‌ర్చ న‌డుస్తోంది.విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు.

టీఆర్ ఎస్ ప‌గ్గాలు నిజామాబాద్ ఎంపీ క‌విత‌కి అప్ప‌గిస్తార‌ని తెలుస్తోంది.

వాస్త‌వానికి టీఆర్ ఎస్‌లో సీఎం కేసీఆర్ కుమారుడు కేటీఆర్‌, మేన‌ల్లుడు హ‌రీష్‌రావులు యాక్టివ్‌గానే ఉన్నారు.

మ‌రీ ముఖ్యంగా కేటీఆర్ అయితే, త‌న మంత్రిత్వ శాఖ‌కు సంబంధించి చాలా యాక్టివ్‌గానే ఉన్నారు.దీంతో టీఆర్ ఎస్ ప‌గ్గాలు అప్ప‌గించాల్సి వ‌స్తే.

కేటీఆర్‌కి ఖాయ‌మ‌నే వ్యాఖ్య‌లు వ‌చ్చాయి.అయితే, అప్ప‌ట్లోనే ఈ వ్యాఖ్య‌ల‌కు ముగింపు ప‌లుకుతూ.

కేసీఆర్ యాక్టివ్ అయిపోయారు.త‌న కార్య‌క‌లాపాల‌ను నిర్వ‌హించ‌డం, స‌మీక్ష‌లు చేయ‌డం ద్వారా వార‌స‌త్వం అనే మాట బ‌య‌ట‌కు రాకుండా చూశారు.

కానీ, అనూహ్యంగా ఇప్పుడు.కేసీఆర్ నివాసంలోనే టీఆర్ ఎస్ వార‌స‌త్వంపై పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రిగింద‌ని తెలుస్తోంది.

ఈ సంద‌ర్భంగానే నిజామాబాద్ ఎంపీ, కేసీఆర్ గారాలప‌ట్టి క‌విత‌కు ఈ పార్టీ ప‌గ్గాలు అప్ప‌గించాల‌నే సూచ‌న‌లు వ‌చ్చాయ‌ట‌.తెలంగాణ జాగృతి పేరుతో ప్ర‌త్యేక రాష్ట్రం కోసం క‌విత ప‌డ్డ శ్ర‌మ‌ను ఈ సంద‌ర్భంగా గుర్తు చేసుకున్నార‌ట‌.

ఈ క్ర‌మంలోనే .క‌విత‌కు పార్టీ ప‌గ్గాలు అప్ప‌గిస్తే బాగుంటుంద‌నే అభిప్రాయాన్ని సాక్షాత్తూ కేసీఆర్ త‌నకు అత్యంత స‌న్నిహితులుగా భావిస్తున్న వారి వ‌ద్ద అన్న‌ట్టు తెలిసింది.మ‌రి ఏం జ‌రుగుతుందో తెలియాలంటే మాత్రం వెయిట్ చేయ‌క‌త‌ప్ప‌దు.ఇలా క‌విత‌ను వార‌సురాలిగా ప్ర‌క‌టిస్తే.కేటీఆర్ ఊరుకుంటాడా? హ‌రీష్ ఏమీ అన‌డా? అనే సందేహాలూ ఉన్నాయి.ఏం జ‌రుగుతుందో ఫ్యూచ‌ర్‌లోనే తెలియాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube