చీకటి రాజ్యంతో తెలంగాణా ఐటీ మంత్రి రిలాక్స్

ఏ రంగంలోని వారైనా కష్టపడి పనిచేసిన తరువాత ఏదో ఒక విధంగా రిలాక్స్ కావాలని అనుకుంటారు.అంటే శ్రమ నుంచి సేద తీరాలని అనుకుంటారు.

 Ktr Relaxes With Cheekati Rajyam-TeluguStop.com

తెలంగాణా ఐటీ అండ్ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి తారక రామారావు వరంగల్ లోక్ సభ నియోజకవర్గంలో గులాబీ పార్టీ తరపున తీవ్రంగా ప్రచారం చేశారు.బాగా అలసిపోయారు.

నిన్ననే ప్రచారం ముగిసింది.సరిగ్గా ప్రచారం ముగిసే సమయానికి మంత్రి రిలాక్స్ కావడానికి మంచి అవకాశం దొరికింది.

కమల హాసన్ సినిమా చీకటి రాజ్యం ఈ రోజు విడుదల అయింది కదా.నిన్న దాన్ని ప్రముఖుల కోసం ప్రత్యేకంగా ప్రదర్శించారు.మంత్రిని కూడా పిలిచారు.ప్రచారంలో అలసిపోయినప్పటికీ కమల హాసన్ సినిమా కావడంతో మంత్రి అటెండ్ అయ్యారు.అందులోనూ కమల్ అంటే మంత్రికి ఇష్టం.చీకటి రాజ్యం సినిమా మంత్రికి బాగా నచ్చింది.

సినిమా బాగుందని మెచ్చుకున్నారు.తారక రామా రావుకు సహజంగానే సినిమాలు అంటే ఇష్టం.

ఎంతైనా యువకుడు కదా.మంత్రులకు కూడా కాస్తంత కళా పోషణ ఉండాలి.లేకపోతే ఆ ఒత్తిడులకు పిచ్చెక్కి పోతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube