ఆదుకునే బాధ్యత ఉంది

భయంకరమైన భూకంపతో అతలాకుతలమైన మన పొరుగు రాజ్యం, చిన్న హిమాలయ దేశమైన నేపాల్‌కు ఇతోధిక సాయం చేయాలని భారత్‌ నిర్ణయించింది.సాయం చేసే కార్యక్రమం పేరు ‘ఆపరేష్‌ మైత్రి’.

 India’s Aid To Nepal Named ‘operation Maitri’-TeluguStop.com

వాస్తవంగా నేపాల్‌ను భారత రక్షిత దేశంగా వ్యవహరిస్తారు.అంటే అవసరమైనప్పుడు నేపాల్‌ను ఆదుకోవల్సిన బాధ్యత భారత్‌ మీదనే ఉంది.

అది పేరుకే విదేశంగాని మనకు, దానికి వేల ఏళ్లుగా విడదీయరాని అనుబంధం ఉంది.మన సైన్యంలో గూర్ఖా రెజిమెంట్‌ ఉంది.

మన దేశంలో వేల వ్యాపార సంస్థలకు, అనేక కార్యాలయాలకు గుర్ఖాలు రక్షణ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.రెండు దేశాల మధ్య వీసా నిబంధన కూడా లేదు.

మరి ఇలాంటి పొరుగు దేశానికి ఆపద వచ్చినప్పుడు ఆపన్న హస్తం అందించాల్సిందే కదా.భూకంప నేపాల్‌కు సహాయం చేసే మన సైన్యం ఆ కార్యక్రమానికి ఆపరేషన్‌ మైత్రి అని పేరు పెట్టింది.నేషనల్‌ డిజాస్టర్‌ రెస్పాన్‌్స ఫోర్‌్స (ఎన్‌డిఆర్‌ఎఫ్‌) కూడా తన బృందాలను నేపాల్‌ పంపింది.ఎయిర్‌ ఫోర్‌్స విమానాల ద్వారా సహాయ సామగ్రిని తరలించారు.ఈరోజు (ఆదివారం) పది విమానాలు ఖాట్మండు వెళుతున్నాయి.డాక్టర్లను, ఇంజినీర్లను పంపుతున్నారు.

అనేక వస్తువులు, పరికరాలు, దుస్తులు…ఇలాంటివాటితోపాటు ఆహారం, మంచినీరు కూడా పంపుతున్నారు.హిమాలయ రాజ్యానికి వచ్చిన ముప్పు నుంచి అక్కడివారు బయటపడి సాధారణ పరిస్థితి ఏర్పడేవరకూ భారత్‌ చేయూతనివ్వాల్సిన అవసరముంది.

ఇస్తుంది కూడా.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube