Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

భారతీయులు కనిపెట్టిన అత్యంత వింత కండోం ఇది -Indians Introduced Most “Spicy” Condom In The World

వింత ప్రపంచం .. వింత మనుషులు. రోజుకో వింత పని చేస్తున్నారు. అందులో అర్థంపర్థం లేని పనులే ఎక్కువ. తమ క్రియేటివి చూపించడం కోసం దేన్నీ కూడా వదలట్లేదు. ఆఖరికి కండోంని కూడా. మొదట ప్లెయిన్ గా మొదలైన కండోం బిజినెస్ ఆ తరువాత కొంతపుంతలు తొక్కింది. కొత్త కొత్త డిజైన్స్ పుట్టుకొచ్చాయి. వజ్రాలతో ఉపయోగించి కండోం డిజైన్ చేసిన మహానుభావులు ఉన్నారు. ఆ తరువాత ఫ్లేవర్స్ ని తీసుకొచ్చారు. మీరు విన్నది నిజమే. ఓరల్ సెక్స్ ని రక్తి కట్టించడం కోసం ఈ వింత పని చేసారు. బనానా ఫ్లేవర్, చాకొలేట్ ఫ్లేవర్, ఆపిల్ ఫ్లేవర్, ఆరెంజ్ ఫ్లేవర్ ఇలా ఒకటా రెండా, ఎన్నో ఫ్లేవర్స్ ఉపయోగించి కండోమ్స్ చేస్తున్నారు. ఈ అతిని మరో లెవల్ కి తీసుకెళ్ళారు భారతీయులు. “పికేల్” ఫ్లేవర్ ఆచారి కండోమ్స్ తీసుకొచ్చారు. అంటే పచ్చడి ఫ్లేవర్ కండోమ్స్ అన్నమాట.

ఛీఛీ .. ఇదేమి దరిద్రం అని మీరు అనుకుంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకంటే ఎక్కువ అతి చేసి వెస్ట్రన్ దేశాలవారు కూడా ఈ వింత పని చూసి బిత్తరపోతున్నారు. పచ్చడి ఫ్లేవర్ లో కండోం తయారుచేయాలి అనే ఆలోచన పుట్టిన మహానుభావుడు ఎవడో కనిపిస్తే నాలుగు తన్నులు తంతాము అంటూ ట్వీట్స్ పెడుతున్నారు. ఇదేదో కూల్ డ్రింక్ అయినట్టు ఇప్పటిదాకా వచ్చిన ఫ్లేవర్స్ సరిపోకుండా ఈ చెత్త ఫ్లేవర్ ఏంటని అడుగుతున్నారు.

నేటిజన్స్ ఇలా అగ్రాహానికి గురవడంలో తప్పు లేదు. ఎందుకంటే ఈ ఐడియా అలాంటిది. సరే, ఓరల్ సెక్స్ లో ఎదో డిఫరెంట్ అనుభవం కోసం ఇలా కారంగా, పుల్లగా అనిపించే పచ్చడి ఫ్లేవర్ కండోం బాగుంటుందేమో, మరి ఇదే కండోంని ఇంటర్ కోర్స్ లో వాడితే పరిస్థితి ఏంటి ? జనాలు మంటలు ఎక్కడ ఆర్పుకోవాలి? ఏదైనా జరిగితే ఎక్కడికి పరుగులు తీయాలి ? కండోంలో కారం ఏమిటి ? ఇదేమి అతి ! ఈ వెరైటి కండోం మీద కొందరు నేటిజన్స్ పెట్టిన కొన్ని ట్వీట్స్ ని అనువాదం చేస్తున్నాము .. చదివి నవ్వుకోండి.

* “ఆచారి కండోం వాడిన తరువాత, పార్టనర్స్ ఇద్దరు నగ్నంగా కాసేపు ఫ్యాన్ కింద పడుకోవాల్సిందే”

* ఇకనుంచి వంట ప్రోగ్రామ్స్ లో ఆచారి కండోం ఎలా తయారుచేస్తారో చూపించాలి”

* “లీటర్ వాటర్ బాటిల్ పక్కన పెట్టుకుంటే తప్ప, ఆచారి కండోంతో పక్కలో ఆ పని చేయకూడదు”

* “ఇంట్లో సడెన్ గా పచ్చడి అయిపోతే వెంటనే మెడికల్ షాప్ కి వెళ్లి ఆచారి కండోం కొనుక్కోవాలి”

* “ప్రియ ఆచారి కండోం, హల్దిరాం ఆచారి కండోం .. ఇందులో కూడా కొత్త బ్రాండ్స్ ఉండాలి”

బాగున్నాయి కదా జోకులు. ఇది తయారుచేసిన Manforce సంస్థ, ఆ పచ్చడి యొక్క ఫ్లేవర్ ఏంటో మాత్రం చెప్పలేదు. అది మామిడికాయ పచ్చాడా, ఉసిరి పచ్చాడా అనేది ఇంకా చెప్పలేదు.

Continue Reading
More Posts
To Top