Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

పురుషులలో శృంగార సామర్థ్యాన్ని పెంచే దినుసులు ఇవన్ని -Indian Spices That Increase Libido In Men

మెంతులతో ఏం చేస్తారు అంటే పచ్చల్లలో వేసుకుంటారు అంటారు. జీలకర్రతో ఏం చేస్తారు అంటే జీర రైస్ చేస్తారు అంటారు. మరి లవంగంతో ? ఏముంది వీటిలాగే వంటల్లో వాడతాం, యాలకులని బగారాలో వాడతాం, ఉల్లిపాయలు పప్పులో వేస్తాం, సఫ్రాన్ ని స్వీటులో వాడతాం. ఇంతేనా ? మన వంటింట్లో ఉండే మసాలా దినుసులకి కేవలం వంటింటి అవసరాలకే, వంట చేయడానికే పనికివస్తాయా ? లేదు .. వీటి లాభాల లిస్టు చాలా పెద్దది. రోజంతా కూర్చున్నా మనం టాపిక్ ఫినిష్ చేయలేం. ఈ దినుసుల్లో అందించే ఎన్నో లాభాల్లో శృంగార వాంఛ కూడా ఒకటి. అవును ఈ దినుసులు పురుషులలో లిబిడోని పెంచుతాయి.

* ఉల్లిపాయలో ఎల్లోసిన్ అనే పదార్ధం ఉండటం వలన ఇది పురుషాంగానికి రక్తప్రసరణ బాగా పెంచుతుంది. తద్వారా అంగస్తంభన సమస్యలు దూరం అవుతాయి.

* లవంగాలు ఒంట్లో కావాల్సినంత వేడిని ఇస్తాయి. ఇది టెస్టోస్టెరాన్ లెవల్స్ ని పెంచి శృంగారంలో చురుగ్గా ఉండేలా చేస్తుంది.

* మెంతుల్లో సపోనిన్స్ ఉంటాయి. ఇవి కూడా టెస్టోస్టెరాన్ లెవల్స్ ని పెంచి, కామదాహాన్ని పెంచుతాయి.

* కుంకుమపువ్వు పాలలో వేసుకొని తాగి, శృంగారం చేస్తే పిల్లలు ఎర్రగా పుడతారని నమ్ముతారు. అది పూర్తిగా నిజం కాదు కాని కుంకుమపువ్వు సెక్స్ లో కావాల్సిన లిబిడోని ఎనర్జీని మాత్రం ఇస్తుంది.

* జీలకర్ర లిబిడోని పెంచడమే కాదు, శీఘ్రస్కలనం వంటి సమస్యను తగ్గిస్తుంది. దీన్ని ఫేనుగ్రీక్ సీడ్స్ తో కలిపి తీసుకోవాలి.

* యాలకులలో ఉండే స్నినియోల్ స్టామినాని పెంచుతుంది. ఇది శృంగారంలో బలాన్ని కూడా ఇస్తుంది.

* అశ్వగంధ, బాజికాయ కూడా శృంగార కోరికలను, శృంగార సామర్థ్యాన్ని పెంచుతాయి. వీటిని వేల ఏళ్ళుగా వాడుతున్నారు.

Continue Reading
More Posts
To Top