Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

కొడుకు తప్పిపోయాడని కంప్లయింట్ ఇచ్చారు .. అతడే అమ్మాయిలాగా దొరికాడు-Indian Parents Report For Lost Son .. Police Finds Him As A Daughter

వారిది ఒక మాధవ్ పురలో ఒక స్వర్ణకారుల కుటుంబం. ఒక కొడుకు, ఓ కూతురు ఉన్నారు. 25 ఏళ్ళ కొడుకు శ్యాం చదువు పూర్తిచేసుకోని తమ కులంపనే చేసుకుంటున్నాడు. అనుకోకుండా అతను తప్పిపోయాడు, నిజానికైతే పారిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. దాంతో తల్లిందండ్రులు పోలీసులని ఆశ్రయించారు. తప్పిపోయిన తన కోడుకుని వేతికిపెట్టమని వేడుకున్నారు.

వారంలో పోలీసులు ఫోన్ చేసారు. తమ కొడుకు ఆచూకి గురించే చెబుతారేమో అని ఆశ. వారి ఆశ అడియాశ కాలేదు. పోలీసులు ఫోన్ చేసి శ్యాం దొరికాడని కాదు, దొరికింది అని చెప్పారు. మొదట తల్లిందండ్రులకి అర్థం కాలేదు. ఆ తరువాత పోలీసులు వివరంగా చెప్పారు, తప్పిపోయిన మీ కొడుకు ఇప్పుడు కొడుకు కాదు కూతురు అని, లింగమార్పిడి చేసుకున్నాడని. తల్లిందండ్రులు, మరో కూతురు షాక్ కి గురయ్యారు.

Continue Reading
More Posts
To Top