Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

హైదరాబాద్ విమానంలో అబ్బాయి హస్తప్రయోగం, అరెస్టు చేసిన పోలీసులు-Indian Man Masturbates In Aeroplane .. Gets Arrested

హస్తప్రయోగం అనేది చాలా ప్రైవేట్ పని. ఒంటరిగా ఉన్నప్పుడు, రెండో కన్ను చూడనప్పుడు చేసే పని. శృంగారం గురించైనా జనాలు బయటకి చెప్పుకుంటారు కాని హస్తప్రయోగం గురించి మాత్రం చెప్పుకునేందుకు మొహమాటం అడ్డువస్తుంది. అలాంటి ప్రైవేట్ పనిని, పబ్లిక్ లో, అదికూడా గాలిలో వెళుతున్న విమానంలో చేయబోయాడు ఒక అబ్బాయి. తాను ఒక భారతీయుడు కావడం, అందులోనూ హైదరాబాద్ నుంచి బయలుదేరిన విమానంలో ఇలాంటి పనిచేయడం విశేషం. ఈ పని చేసినందుకు అతడిని అరెస్టు కూడా చేసారు పోలీసులు, ఒకటి కాదు రెండు కేసులు వేసి అరెస్టు చేసారు. అదేంటి, హస్తప్రయోగం నేరం కాదుగా అని అనుమానపడుతున్నారా? అసలు ఏం జరిగిందో చూడండి.

రమేష్ చంద్ అనే ఈ అబ్బాయి విమానంలో ఓ అమ్మాయి పక్కనే కూర్చున్నాడు. ఆ అమ్మాయి ఇచ్చిన కంప్లయింట్ ప్రకారం తన ప్యాంట్ బటన్స్‌ విప్పాడట ముందు. ఓ అమ్మాయి పక్కనే కూర్చుంది అనే మొహమాటం కూడా లేకుండా వెంటనే హస్తప్రయోగం చేసుకోవడం మొదలుపెట్టాడట. కంగారుపడ్డ ఆ అమ్మాయి ఎయిర్ సిబ్బంది దృష్టికి ఈ విషయానికి తీసుకువచ్చింది. దాంతో తన సీటుని మార్చారు సిబ్బంది. రమేష్ ని వాష్ రూమ్ పంపించి, తనని తాను క్లీన్ చేసుకొమ్మన్నారు.

ముందే పోలీసులకి సమాచారాన్ని అందించి, విమానం ఢిల్లీలో దిగగానే పోలీసులకి అప్పగించారు. అతని మీద సెక్షన్ 509 (మహిళను అవమానించడం) , సెక్షన్ 345A (లైంగిక వేధింపు) ల కింద కేసు బుక్ చేసి చరసాలకి తీసుకెళ్ళారు. ఇలాంటి సంఘటన మనదేశంలో జరగడం ఇదే మొదటిసారి కాదు. 2009 లో కూడా ఢిల్లికి చెందిన ఓ పురుషుడు విమానంలో హస్తప్రయోగం చేసుకున్నందుకు పోలీసులు అరెస్టు చేసారు.

Continue Reading
To Top