లవ్ ఎట్ ఫస్ట్ సైట్ పై తమ అభిప్రాయాలు చెప్పిన అమ్మాయిలు

మన తెలుగు సినిమాల్లో చూస్తుంటాం … హీరో ఇంట్రోడక్షన్ ఇలా పూర్తవుతుందో లేదో అలా హీరోయిన్ కనబడుతుంది.పూల పడతాయి, స్లో మోషన్ లో హీరోయిన్ ముఖాన్ని ఇలా చూడగానే అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ … ఖతం హీరో ప్రేమలో పడిపోతాడు.

 Indian Girls Speak Out On “love At First Site”-TeluguStop.com

అప్పటికప్పుడు ఓ ట్యూన్ కి లిరిక్స్ కట్టి పాట పాడేసుకుంటాడు.ఇక ఈ జన్మ నీదే అంటాడు, నువ్వు లేకుండా ఉండలేను అంటాడు.

అంతా ఒక్క చూపులోనే.ఒక్క చూపులోనే తన జీవిత భాగస్వామి ఈమె అని ఎలా డిసైడ్ చేసుకుంటాడు ? అది నిజంగా సాధ్యపడే విషయమా ? అసలు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లో ప్రేమలో ఎలా పడతారు? దీనిపై అమ్మాయిల అభిప్రాయం ఏమిటో చూసేందుకు ఒక ఇండియన్ లైఫ్ స్టయిల్ ఛానెల్ వీధుల్లోకి వెళ్లి అమ్మాయిలను అడిగింది.అందులో కొన్ని స్పందనలు చూడండి.

అమ్మాయి 1 :

“నేనైతే అస్సలు నమ్మను.లవ్ ఎట్ ఫస్ట్ సైట్ నాకు నమ్మకం లేనే లేదు.ఒక్క చూపులో ప్రేమ ఎలా పుడుతుందో, దాన్ని సినిమావాళ్ళు ఎలా చూపిస్తారో తెలియదు.రోడ్డు మీద ఎంతోమంది అందమైన అబ్బాయిలు ఉంటారు.కంటికి అందరు నచ్చుతారు.

నిజం చెప్పాలంటే బాగున్న అబ్బాయిల వైపే చూస్తాను.కాని ఒక వ్యక్తి మనస్తత్వం నచ్చితే అతడు ఎలా ఉన్నాడు అనేది తరువాతి విషయం.కాబట్టి లవ్ ఎట్ ఫస్ట్ సైడ్ అనేది వెస్ట్.

అమ్మాయి 2 :

సినిమాల్లో హీరో హీరోయిన్లు ఎలా నచ్చుతారో ఈ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కూడా అంతే.పడిపోవడం వేరు, ప్రేమలో పడిపోవడం వేరు.నచ్చడం వేరు, ప్రేమించడం వేరు.అమ్మ నాన్నల తరువాతి ఒక వ్యక్తి అలాంటి స్థానం ఇస్తున్నామంటే అతడిని వ్యక్తిగా ప్రేమించగలగాలి.శరీరాన్ని కాదు.

అమ్మాయి 3 :

నమ్మడం నమ్మకపోవడం వేరు కాని, మొదటి చూపులు అతడు లేదా ఆమె నా సోల్ మేట్ అనిపిస్తే అది ప్రేమేనెమో.కొందరికి అలా జరుగుతుందేమో .నాకైతే జరగలేదు.నాకు బాయ్ ఫ్రెండ్ కూడా లేడు.కాబట్టి నాకు ఇవేమీ తెలిదు.

అమ్మాయి 4 :

ఇలా చూడగానే అలా ఆకర్షణ లేదా కామం పుడుతుంది కాని ప్రేమ ఎక్కడ పుడుతుంది.ఎదో అలా భ్రమపడతారు అంతే.అంటే వారిద్దరి మధ్య ఆ తరువాత మెల్లి మెల్లిగా ప్రేమ పుట్టొచ్చు కాని ఒక్కసారికే పుట్టేది మాత్రం ఆకర్షణే.అదే ఆ తరువాత బలపడుతుంది.

అమ్మాయి 5 :

నేను కూడా ఇవన్ని నమ్మను.మన కంటికి పదిమంది లో కనీసం ముగ్గురు నలుగురైనా నచ్చుతారు.అందర్నీ ప్రేమించలేము కదా.కాబట్టి ఆ ఒక్క వ్యక్తి మనసుకే దొరకాలి కాని కంటికి కాదు.అప్పుడే ప్రేమ బలంగా ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube