పొద్దున్నే ఏ టిఫిన్ చేయడం బెటర్ ?

పొద్దున్నే, రాత్రంతా చేసిన ఉపవాసాన్ని బ్రేక్ చేస్తూ టిఫిన్ చేయడం ఎంత ముఖ్యమో, చేయాల్సిన టిఫిన్ చేయడం కూడా అంతే ముఖ్యం.టిఫిన్ అనగానే మనకు ఇడ్లి, దోశ, పూరి, వడ, ఉప్మా గుర్తుకువస్తాయి.

 Which Indian Breakfast You Should Prefer In Morning ?-TeluguStop.com

వీటిలో ఎవరికీ ఇష్టం వచ్చింది వారు తింటారు.అంటే, రుచి కోసం ఏది ఇష్టంగా అనిపిస్తే, అది లాగించేస్తారు అన్నమాట.

మరి న్యూట్రిషన్ నిపుణుల ప్రకారం ఏం తినాలి ? రుచి కోసం కాకుండా, ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఏ టిఫిన్ చేయాలి ? ఇడ్లి బెటర్ అంటారా ? పూరి మంచిది అంటారా ? ఇవి రెండు కాదు వడ అంటే మీకు ఇష్టమా ?

పొద్దున్నే ఆయిల్ ఉన్న ఆహారం తినడం అంత మంచి అలవాటు కాదు అని డాక్టర్లు చెబుతూ ఉంటారు.అందుకే బాగా డబ్బున్న వారైతే, ఆకుకూరల, ఫ్రూట్స్ తో నిండిన సలాడ్స్ తింటూ ఉంటారు.

ఇలా ఎందుకు అంటే కారణం ఉంది.ఆయిల్ ఉన్న ఫుడ్ తింటే ఫ్యాట్ శరీరంలోకి పొద్దున్నే చేరిపోతుంది.

మరి మధ్య తరగతి కుటుంబంలో రోజు కుటుంబ సభ్యులంతా సలాడ్స్ తినాలంటే విలుపడని విషయమే.కాని మన తాహతులో ఇడ్లి ఉందిగా.

అవును, ఇడ్లీ న్యూట్రిషన్స్ మెచ్చిన ఆహారం.ఇది ఆయిల్ లేని స్తీమ్ద్ ఫుడ్ కావడంతో దీని మీద మక్కువ చూపించాలని సూచిస్తారు డాక్టర్లు.

మిగితా టిఫిన్స్ అయితే, పాన్ లో ఆయిల్ వేసి చేయాల్సిందే కదా.ఇడ్లీ అలా కాదు కాబట్టి ఎలాంటి అధిక కొవ్వుని శరీరానికి అందించదు.భారతీయులు తినే టిఫిన్స్ లో ఇడ్లీని మించిన ఆహారం లేదు అని పరిశోధనలు కూడా చెబుతున్నాయి.

ప్రోటీన్, ఫైబర్, కార్బోహైడ్రేట్స్, ఐరన్, పొటాషియం, విటమిన్ ఏ వంటి అవసరమైన మినరల్స్ కలిగిన ఇడ్లీలో కాలరీలు తక్కువ ఉంటాయి, బ్యాడ్ కొలెస్టరాల్ ఉండదు, సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉండవు.

కాబట్టి ఇది పొద్దున్న టిఫిన్ లో తినాల్సిన ఆరోగ్యకరమైన ఆహారం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube