2020 నాటికి భారతదేశంలో అంత పెద్ద మార్పు జరగబోతోందా!

2000 వ సంవత్సరంలో మనదేశంలో ఎంతమంది ఇంటర్నెట్ వాడేవారో తెలుసా? కేవలం 55 లక్షలమంది.2002లో ఈ సంఖ్య కోటిని దాటింది.2005లో 5 కోట్ల మార్క్ దాటితే, 2011 లో పదికోట్ల మంది ఇంటర్నెట్ వాడటం మొదలుపెట్టారు.ఇక 2015 నాటికి 35 కోట్ల మంది ఇంటర్నెట్ వాడుతోంటే, ఈ సంవత్సరానికి ఆ సంఖ్య 46 కోట్లు దాటింది.

 India Will Have 73cr Internet Users By 2020-TeluguStop.com

చుసారా .స్మార్ట్ ఫోన్ యుగంలో ఎంత భారి మార్పు జరిగిందో.2020 నాటికి మరింత పెద్ద మార్పు జరగబోతోందట.

నాస్ కామ్, అకమై టెక్నాలజీ కలిసి ” ది ఫ్యూచర్ ఆఫ్ ఇంటర్నెట్ ఇన్ ఇండియా” పేరుతో రూపొందించిన నివేదిక ప్రకారం 2020 నాటికి మనదేశంలో 73 కోట్ల ఇంటర్నెట్ వినియోగదారులు ఉంటారు.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, కొత్తగా వచ్చే వినియోగదారుల్లో 75% మంది గ్రామీణ ప్రాంతాల వారే ఉంటారని నివేదిక తెలిపింది.

రిలయన్స్ జియో తెచ్చిన విప్లవం ద్వారా ఇంటర్నెట్ మరింత చవకగా మారనుందని, తద్వారా గ్రామీణ ప్రాంతలవారు కూడా ఇంటర్నెట్ ని బాగా వినియోగించుకుంటారని పరిశోధకులు కూడా అంచనా వేస్తున్నారు.

అంతేకాదు, ప్రాంతీయ భాషల్లోకి గూగుల్ సర్వీసులు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చే రోజు కూడా దగ్గరలోనే ఉందట.అదీకాక, స్మార్ట్ ఫోన్ రోజురోజుకు తన అవసరాన్ని పెంచుకుంటూ పోతోంది.

ఇదంతా చూస్తోంటే మరో నాలుగు సంవత్సరాల్లో ఆ 73 కోట్ల ఇంటర్నెట్ వినియోగదారులు మన దేశంలో ఉండటం పెద్ద కష్టమైన విషయం ఏమి కాదేమో అనిపిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube