ఇలియానా గంటలకొద్దీ ఏడ్చేదట

ఇలియానా స్మైల్ అలా పడేస్తే ఇలా పడిపోతారు కుర్రాళ్ళు.కాని ఇలియానాని సినిమాల్లో తప్ప బయట ఎప్పుడు ఏడుస్తుంటే చూడలేదు కదా.

 Ileana Used To Cry For Hours In Depression-TeluguStop.com

ఎవరు చూడలేదు కాని ఇలియానా గంటలకొద్దీ ఏడ్చేదట.ఎవరు చూడకుండా, బయటకి రాకుండా, ఒంటరిగా, శూన్యంలో వెక్కివెక్కి ఏడ్చేదట.

ఎందుకు అంటే తన బాడిని చూసి ఏడ్చేదట.సినిమాలు బాగానే చేస్తున్నా, తన ఫిగర్ పై జనాలు చేసే కామెంట్స్ కి బాధపడేదేమో.

అదేంటి ఇలియానా నడుము అందాలు బాగా ఫేమస్ కదా అని అనుకుంటున్నారా ? అది ఓకే కాని ఇలియానా ఓసారి చెప్పినట్లుగా తన ఫిగర్ (ముఖ్యంగా ఛాతి భాగం) మీద ఎన్నో కామెంట్స్ వింటూ వచ్చిందట.

అది ఎంత లోతుగా గాయపర్చాయంటే, తాను ఇంట్లోంచి బయటకి రాకుండా ఏడుస్తూ కూర్చునేదట.

డిప్రేషన్ లోకి వెళ్లిపోయిందట.అయితే ఇప్పుడు అంతలా బాధపడట్లేదని, అలా ఎందుకు ఆలోచించేదాన్నో అర్థం కావడం లేని చెప్పింది గోవా బ్యూటి.

ఇక సినిమాలు విషయానికి వస్తే, ఇటివలే రుస్తోంతో మంచి సక్సెస్ అందుకున్న ఈ భామ, ఇటు అజయ్ దేవగణ్ బాద్షాహో, అటు అర్జున్ కపూర్ తదుపరి సినిమాలో ఛాన్స్ కొట్టేసింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube