మహేష్ ఛాన్స్ మిస్ చేసుకున్న ఇలియానా..!

గోవా బ్యూటీ ఇలియానా బ్యాడ్ లక్ ఇంకా కొనసాగుతూనే ఉంది.తెలుగులో స్టార్ రేంజ్ కు వచ్చాక చెప్పాపెట్టకుండా బాలీవుడ్ కు చెక్కేసిన ఈ బ్యూటీ అక్కడ ఆశించినంత సక్సెస్ అవ్వలేదు.

 Ileana Missed Mahesh Movie Chance-TeluguStop.com

అయినా సరే ఇన్నాళ్లు అక్కడే ఉండి ఆఫర్లు కోసం ఎదురుచూసిన చిట్టి నడుము చిన్నది మళ్లీ సౌత్ బాట పట్టింది.అయితే ఇక్కడ మంచి క్రేజ్ మీదున్నప్పుడు కాదని వెళ్లిన ఇల్లి బేబ్ కు సౌత్ లో అంత గొప్ప గ్రాండ్ వెల్కం ఏం పలుకలేదు సరికదా అసలు సినిమా అవకాశం కూడా ఇవ్వట్లేదు దర్శక నిర్మాతలు.

ఇక వచ్చిన అర కొర అవకాశాలైనా సరే చేస్తుందా అంటే తనను హీరోయిన్ గా అడగడానికి వచ్చిన వారికి భారీ రెమ్యునరేషన్ తో షాక్ ఇస్తుంది.ప్రస్తుతం మహేష్, మురుగదాస్ సినిమాకు కూడా ఇలియానా అలాంటి షాకే ఇచ్చిందట.

మహేష్, ఇలియానాది పోకిరి సూపర్ హిట్ కాంబినేషన్ ఆ తర్వాత ఇద్దరు కలిసి చేసింది లేదు.అదీగాక ఆఫర్స్ కోసం కళ్లు కాయలు కాచేలా చూస్తున్న ఇలియానాకు ఇదో లక్కీ ఆఫర్ అవుతుందని అనుకున్నారు.

కాని ఇలియానా మాత్రం ఆ సినిమాలో నటించాలంటే కనీసం 2 కోట్ల దాకా ఇవ్వాలని డిమాండ్ చేసిందట.దర్శక నిర్మాతలు 50 లక్షల వరకు ఓకే అనుకున్నారట.

సో ఇలియానా భారీ మొత్తంగా అడిగేసరికి ఈ రెమ్యునరేషన్ ఏదో పరిణీతి చోప్రాకే ఇచ్చేద్దాం అని ఆమెను తీసుకున్నారు.సో అలా వచ్చిన అవకాశాలను కూడా ఇలియానా చేజేతులా పోగొట్టుకుంటుంది.

మరి ఇలానే పట్టు బట్టి అంత కావాలి ఇంత కావాలి అని కూర్చుంటే ఇలియానా ఇక సినిమాలు చేసినట్టే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube