Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

ఆఫర్ల కోసం ఎవరితోనూ పడుకోను - ఇలియానా-Ileana Makes Comments On Sexual Favours For Offers

గోవా బ్యూటి ఇలియానా నోటినుంచి వచ్చేవి మాటలు కావు తూటాలు. దేవదాసు తరువాత సినిమా ఇండస్ట్రీ నుంచి బయటకి వెళ్ళిపోదామనుకున్నా అని సూటిగా నిర్మొహమాటంగా చెప్పినా, తన బాయ్ ఫ్రెండ్ ని దాచిపెట్టకుండా పబ్లిక్ గానే పోస్టులు పెట్టినా, ఇంట్లో ఒంటరిగా నగ్నంగా ఉండటం ఇష్టం అంటూ బోల్డ్ గా మాట్లాడినా .. ఇలియానా స్టయిలో వేరు. ప్రస్తుతం ఆఫర్ల కరువులో ఉన్న నడుమందాల సుందరి మరో బోల్డ్ కామెంట్ చేసింది.

విషయం ఏమిటంటే, ఇలియానా చేతిలో గత కొన్ని నెలలుగా రెండంటే రెండే సినిమాలు ఉన్నాయి. కొత్త ఆఫర్లు అస్సలు రావడం లేదు. దక్షిణాదిన మళ్ళీ నటంచాలని ఉందని ప్రకటించినా, మనవాళ్ళు పెద్దగా పట్టించుకోవట్లేదు. అయితే ఈ గడ్డుకాలంలో కూడా తనని తాను నమ్ముకుంటాను తప్ప, ఎవరినీ ఆఫర్ల కోసం అడగను అంటోంది ఇల్లి బేబి.

అంతమాత్రామే కాదు, అవకాశాలు కోసం ఎవరి పడక గదిలోకి కూడా వెళ్ళను, కొందరిలా అత్మాభిమానాన్ని చంపుకోని దిగజారలేను అంటూ కామెంట్స్ చేస్తోంది. ఇలియానాకి సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా ఇంపార్టెంట్, కాని కొందరిలా అంటే ఆ కొందరు ఎవరు? బాలివుడ్ హీరోయిన్ల గురించి మాట్లాడుతోందా లేక టాలివుడ్ హీరోయిన్ల గురించి మాట్లాడుతోందా ? పేర్లు బయటపెట్టకపోయినా, ఇలా కామెంట్ చేయాలంటే ధైర్యం కావాల్సిందే.

ఇక ఈ 30 ఏళ్ళ సుందరి ప్రస్తుతం అజయ్ దేవగణ్ తో బాద్షాహో అనే సినిమా, అర్జున్ కపూర్ తో ముబారకాన్ అనే సినిమా చేస్తోంది. ఇటు తెలుగులో అవకాశాల కోసం కొన్ని ప్రయత్నాలు చేస్తోంది. చూద్దాం .. ఎవరో ఒకరు ఇలియానా వైప చూడకపోతారా!

Continue Reading

మరికొన్ని ప్రత్యేక వార్తలు,అరుదైన చిట్కాలు,వీడియోలు క్రింద చూసి చదవండి

More Posts

More in Telugu Movie News

  • News

    Anisha Ambrose opens up about Pawan Kalyan’s false promise

    By

    అనిషా అంబ్రోస్ .. ఇప్పటికీ మనకు పెద్దగా పరిచయం లేని పేరు. అలాంటిది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నటించే...

  • News

    NTR Wins Over Chiranjeevi

    By

    టాలీవుడ్ యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ మెగాస్టార్ చిరంజీవిపై పైచేయి సాధించాడ‌న్న వార్త ప్ర‌స్తుతం మీడియాలోను, సోష‌ల్ మీడియాలోను హైలెట్ అవుతోంది. ఎన్టీఆర్ మెగాస్టార్‌పై...

  • News

    It’s official .. NTR to host BIGG BOSS show in Telugu

    By

    సినిమా హీరోలు టీవి తెరపై యాంకర్లుగా రావడం బాలివుడ్ లో కొత్తేమి కాదు. ఆమీర్ ఖాన్ సత్యమేవ్ జయతే అనే పాపులర్...

  • News

    This is reason behind disparities between Rajamouli and Allu Aravind

    By

    2009 లో వచ్చిన మగధీర ఓ పెను సంచలనం. అప్పటి ఇండస్ట్రీ హిట్ పోకిరిని చాలా పెద్ద మార్జీన్ తో బద్దలుకొట్టి,...

To Top