గోవా బ్యూటి ఇలియానా కొన్ని నెలలుగా ఖాలిగా ఉంటోంది.గమనిస్తే, తనకు ఇటు దక్షిణాదిలో కాని, అటు బాలివుడ్ లో కాని, మరీ తీసి పారేసెంత ఫ్లాప్స్ లేవు.
కారణాలు ఏవైనా ఇలియానా ని ఎవరు పట్టించుకోవట్లేదు.గత ఏడాది నవంబర్ 21 న విడుదల అయిన హ్యాపి ఎండింగ్ ఇలియానా ఆఖరి సినిమా.
అది పెద్ద ఫ్లాప్ గా నిలిచింది.ఆ సినిమా మినహాయిస్తే హిందీలో ఇలియానా కి మంచి ట్రాక్ రికార్డ్ ఉంది.
అయినా ఇలియానా ఏడాదిగా ఖాలిగా ఉంది.
ఇక బ్రూస్ లీ లో ఐటెం సాంగ్ ఉందని, మెగా స్టార్ తో ఇలియానా చిందులేస్తుందని వార్తలు వచ్చాయి.
అవేవి నిజం కాలేదు.ఇక కొత్తగా, రామ్ చరణ్ – సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాబోతున్న తని ఒరువన్ రీమేక్ లో ఇలియాననే హీరోయిన్ అనే వార్త ప్రచారంలో ఉన్నా, అది ఎంతవరకు నిజమో తెలియదు.
అదేదో చైనా సినిమాలో జాకిచాన్ సరసన నటిస్తుంది అన్నారు.దాని మీద కుడా మళ్ళి సమాచారం లేదు.
ఇలాంటి పరిస్థితుల్లో ఇలియానా తలుపు తట్టింది ఒక అవకాశం.
అయితే ఇది మెయిన్ హీరోయిన్ రోల్ కాదు.
అక్షయ్ కుమార్ త్వరలో ప్రారంభించబోతున్న “రుస్తుమ్” లో సెకండ్ హీరోయిన్ గా కనిపించనుందట ఇల్లీ బేబి.ఇందులో మెయిన్ హీరోయిన్ ఇషా గుప్త.
నడుము సుందరి కాస్త సెకండ్ హీరోయిన్ అయిపోతోంది.ఏం చేస్తాం .టైం ఎప్పుడు మనవైపే ఉండదు గా !
.