Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

జియో, ఎయిర్‌టెల్‌కు షాక్‌: ఐడియాలో వొడాఫోన్ విలీనం-Idea-Vodafone Merger Creates India’s Largest Telco

ఇండియ‌న్ టెలీకం రంగంలో అతిపెద్ద కంపెనీగా ఐడియా సెల్యూల‌ర్ అవ‌త‌రించింది. ఇప్ప‌టి వ‌ర‌కు చూసుకుంటే ఇండియ‌న్ టెలికం రంగంలో 30 కోట్ల యూజ‌ర్ల‌తో ఎయిర్‌టెల్ అది పెద్ద సంస్థ‌గా ఉంది. ఇక రిల‌య‌న్స్ జియో చాలా త‌క్కువ టైంలోనే 10 కోట్ల మూజ‌ర్ల‌కు చేరువైంది. ఈ క్ర‌మంలోనే జియో వ‌రుస ఆఫ‌ర్ల దెబ్బ‌కు మిగిలిన టెలికం కంపెనీలు కూడా వ‌రుస‌గా ఆఫ‌ర్ల‌తో ముందుకు వస్తున్నా మార్కెట్లో జియో పోటీని త‌ట్టుకోలేక‌పోతున్నాయి.

ఈ క్ర‌మంలోనే ఈ పోటీలో బాగా వెన‌క‌ప‌డ్డ ఐడియా ఇప్పుడు జియోతో పాటు ఎయిర్‌టెల్‌కు బిగ్ షాక్ ఇస్తూ ఐడియా+వొడాఫోన్ ఒక్క‌ట‌య్యాయి. ఈ ఒప్పందంతో ఐడియా ఇప్ప‌టి వ‌ర‌కు టాప్ ప్లేస్‌లో ఉన్న ఎయిర్‌టెల్‌ను దాటేసింది. 2018 నాటికి విలీన ప్రక్రియ పూర్తి కానుంది. ఒప్పందం ప్ర‌కారం ఐడియా, వొడాఫోన్ ప్రమోటర్లు తమ తమ వైపు నుంచి ముగ్గురు డైరెక్టర్లను నామినేట్ చేస్తారు. చైర్మన్‌ను నియమించుకునేందుకు ఐడియాకు పూర్తి హక్కులు ఉంటాయి.

ఈ రెండు చేతులు క‌ల‌ప‌డంతో 205 మిలియ‌న్లు ఉన్న వొడాఫోన్ యూజ‌ర్లు, 190 మిలియ‌న్ల ఐడియా యూజ‌ర్లు ఒక్క‌టై మొత్తం 40 కోట్ల మంది యూజ‌ర్ల‌తో ఐడియా ఇండియ‌న్ టెలికం మార్కెట్లో మొత్తం 43 శాతం షేరును సంపాదించుకోనుంది. ఇది ప్రత్యర్థి ఎయిర్ టెల్ కంపెనీ కంటే 10 శాతం ఎక్కువని ఫిచ్ రేటింగ్స్ పేర్కొంది. ఇండియా రేటింగ్స్ ప్రకారం ఈ మెగా విలీనంతో కంపెనీకి 80 కోట్ల రెవెన్యూలు వచ్చి చేరతాయని తెలిసింది.

Continue Reading

More in Featured

  • Things in men dressing that women don’t like

    By

    ఇద్దరు రిలేషన్ షిప్ లో ఉన్నారంటే ఒకరి అభిప్రాయాలని మరొకరు గౌరవించక తప్పదేమో. ముఖ్యంగా పార్డ్ నర్ యొక్క లుక్స్ మీద,...

  • WhatsApp could face a ban in India .. know why?

    By

    మీకు గుర్తు ఉండే ఉంటుంది. కొన్ని నెలల ముందు వాట్సాప్ లోకి End-to-End Encryption అనే అప్డేట్ వచ్చింది. ఈ ఆప్డేట్...

  • Great news for non – Jio Prime users

    By

    మరో అయిదు రోజులు దాటితే ఇంటర్నెట్ మీద బ్రతుకుతున్న జీవితాలలో చాలా మార్పులోచ్చేస్తాయి. జియో అక్కడినుంచి తన ఉచిత సర్వీసులు పూర్తిగా...

  • A 12 year old Indian boy becomes father

    By

    12 ఏళ్ల వయసులో మనమంతా ఎలా ఉండేవాళ్ళం ? బయట ఓ పదినిమిషాలు ఆట ఆడుకోవాలన్నా కష్టంగా ఉండేది .. అట్లా...

To Top
Please Click On Like Page and Share with Your Friends..
Loading..