జియో, ఎయిర్‌టెల్‌కు షాక్‌: ఐడియాలో వొడాఫోన్ విలీనం

ఇండియ‌న్ టెలీకం రంగంలో అతిపెద్ద కంపెనీగా ఐడియా సెల్యూల‌ర్ అవ‌త‌రించింది.ఇప్ప‌టి వ‌ర‌కు చూసుకుంటే ఇండియ‌న్ టెలికం రంగంలో 30 కోట్ల యూజ‌ర్ల‌తో ఎయిర్‌టెల్ అది పెద్ద సంస్థ‌గా ఉంది.

 Idea-vodafone Merger Creates India’s Largest Telco-TeluguStop.com

ఇక రిల‌య‌న్స్ జియో చాలా త‌క్కువ టైంలోనే 10 కోట్ల మూజ‌ర్ల‌కు చేరువైంది.ఈ క్ర‌మంలోనే జియో వ‌రుస ఆఫ‌ర్ల దెబ్బ‌కు మిగిలిన టెలికం కంపెనీలు కూడా వ‌రుస‌గా ఆఫ‌ర్ల‌తో ముందుకు వస్తున్నా మార్కెట్లో జియో పోటీని త‌ట్టుకోలేక‌పోతున్నాయి.

ఈ క్ర‌మంలోనే ఈ పోటీలో బాగా వెన‌క‌ప‌డ్డ ఐడియా ఇప్పుడు జియోతో పాటు ఎయిర్‌టెల్‌కు బిగ్ షాక్ ఇస్తూ ఐడియా+వొడాఫోన్ ఒక్క‌ట‌య్యాయి.ఈ ఒప్పందంతో ఐడియా ఇప్ప‌టి వ‌ర‌కు టాప్ ప్లేస్‌లో ఉన్న ఎయిర్‌టెల్‌ను దాటేసింది.2018 నాటికి విలీన ప్రక్రియ పూర్తి కానుంది.ఒప్పందం ప్ర‌కారం ఐడియా, వొడాఫోన్ ప్రమోటర్లు తమ తమ వైపు నుంచి ముగ్గురు డైరెక్టర్లను నామినేట్ చేస్తారు.

చైర్మన్‌ను నియమించుకునేందుకు ఐడియాకు పూర్తి హక్కులు ఉంటాయి.

ఈ రెండు చేతులు క‌ల‌ప‌డంతో 205 మిలియ‌న్లు ఉన్న వొడాఫోన్ యూజ‌ర్లు, 190 మిలియ‌న్ల ఐడియా యూజ‌ర్లు ఒక్క‌టై మొత్తం 40 కోట్ల మంది యూజ‌ర్ల‌తో ఐడియా ఇండియ‌న్ టెలికం మార్కెట్లో మొత్తం 43 శాతం షేరును సంపాదించుకోనుంది.

ఇది ప్రత్యర్థి ఎయిర్ టెల్ కంపెనీ కంటే 10 శాతం ఎక్కువని ఫిచ్ రేటింగ్స్ పేర్కొంది.ఇండియా రేటింగ్స్ ప్రకారం ఈ మెగా విలీనంతో కంపెనీకి 80 కోట్ల రెవెన్యూలు వచ్చి చేరతాయని తెలిసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube