అట్టహాసంగా ప్రారంభం అయిన ప్రపంచకప్‌

ప్రపంచ క్రికెట్‌ సమరానికి తెర లేచింది.ఈనెల 14 నుండి ప్రారంభం కాబోతున్న ప్రపంచ కప్‌ ప్రారంభ వేడుకలు నేడు అత్యంత వైభవంగా న్యూజిలాండ్‌లో జరిగాయి.

 Icc Cricket World Cup 2015 Launched-TeluguStop.com

న్యూజిలాండ్‌ ప్రధాని జాన్‌ కే అధికారికంగా ఈ వేడుకలను ప్రారంభించారు.మ్యాచ్‌లు మరో రెండు రోజుల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ రెండు రోజులు కూడా నిరాటంకంగా వేడుకలు జరపాలని నిర్ణయించారు.

న్యూజిలాండ్‌ సాంప్రదాయ కళలను, సంస్కృతులను ప్రదర్శిస్తూ ఈ వేడుకలు జరుగుతున్నాయి.

న్యూజిలాండ్‌ ప్రధాని జాన్‌ కే అన్ని జట్లకు శుభాకాంక్షలు తెలియజేశాడు.

అన్ని దేశాల క్రీడాకారులు కూడా తమ దేశం జెండా పట్టుకుని వేడుకల్లో పాల్గొన్నారు.ప్రపంచ కప్‌లో పాల్గొంటున్న జట్ల కెప్టెన్లు అంతా కూడా వేదికపైకి ఒక్కరొక్కరుగా చేరుకున్నారు.

ముందుగా భారత కెప్టెర్‌ మహేంద్ర సింగ్‌ ధోని వేదికపైకి చేరుకున్నాడు.ఆ తర్వాత పాకిస్తాన్‌ కెప్టెన్‌ మిస్బావుల్‌ హక్‌, ఆ తర్వాత ఇతర దేశాల కెప్టెన్లు వేదికపైకి ఎక్కి అభివాదం చేశారు.

వేదికపై పాకిస్తాన్‌ బృదం తమ దేశ భక్తి గీతాన్ని ఆలపించారు.ఇంకా పలు దేశాల నృత్య రీతులను కూడా ఈ వేడుకల్లో ప్రదర్శించారు.

ఈ వేడుకలను ప్రపంచ వ్యాప్తంగా వంద కోట్లకు పైగా ప్రేక్షకులు టీవీల్లో తిలకించినట్లుగా తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube