నా పుట్టుకలో తప్పు జరిగింది అంటోంది కాజల్

కాజల్ అగర్వాల్‌ .ఈ పేరు వింటే చాలు కుర్రాళ్ళ గుండెలు వేగంగా కొట్టుకుంటాయి.

 I Was Born In A Wrong Family – Kajal Agarwal-TeluguStop.com

కెరీర్ మొదలుపెట్టి దశాబ్ద కాలం అవుతున్నా, ఈ గ్యాప్ లో ఎంతోమంది కొత్త హీరోయన్లు స్టార్ గా ఎదిగినా, కాజల్ స్థానం కాజల్ దే.ఇంకా దక్షిణాదిన పెద్ద ఆఫర్లతో దూసుకుపోతోంది.ఓ దక్షిణాది అమ్మాయిలగే కలిసిపోయింది.కాని కాజల్ సౌత్ అమ్మాయి కాదు.తను పుట్టింది మహారాష్ట్రలో.నాటకాలతో కెరీర్ మొదలుపెట్టి దర్శకుడు తేజ కంట్లో పడి లక్ష్మీ కళ్యాణంలో ఛాన్స్ కొట్టేసి, చందమామతో సక్సెస్ రుచి చూసి, మగధీరతో స్టార్ గా ఎదిగింది.

ఇప్పటికీ స్టార్ హీరోయిన్ గానే చలామణి అవుతోంది.

తెలుగు – తమిళ ప్రేక్షకులు ఇంతగా ఆదరించారు కాబట్టే కాబోలు, తాను దక్షిణాది అమ్మాయినే అని, తన పుట్టకలో తప్పు జరిగిందని, ఇక్కడ పుట్టాల్సింది అక్కడ పుట్టేసానని అంటోంది ఈ ముద్దుగుమ్మ.” నా పుట్టుక నా చేతిలో లేదు కాబట్టి తప్పు జరిగింది.నేను పొరపాటులో ఒక నార్త్ ఇండియన్ ఫ్యామిలిలో పుట్టేసాను.

ఈ విషయాన్ని నా కుటుంబసభ్యులకి చాలాసార్లు చెప్పాను.నేను పక్కా దక్షిణాది అమ్మాయిని.

ఈ విషయం గర్వంగా చెబుతా.నాకు బాలివుడ్ లో ఆఫర్స్ వస్తున్నాయి.

కాని నాకు తెలుగు – తమిళ సినిమాలు చేయడమే ఇష్టం.నా కెరీర్ ఇక్కడే మొదలుపెట్టాను.

బాలివుడ్ కోసమని ఇక్కడి సినిమాలి వదులుకోను” అంటూ చెప్పుకొచ్చింది ఈ సుందరి.

ఇదంతా దక్షిణాది మీద ప్రేమేనా లేక ఎలాగో బాలివుడ్ లో ఫేయిల్ అవడం వలన ఇలా కవర్ చేస్తోందా? ఏదోకటి, మనకు కావాల్సింది కాజల్ ని తెర మీద చూడ్డమే.కాజల్ తదుపరి సినిమాల విషయానికి వస్తే రానాతో “నేను రాజు నేనే మంత్రి”, విజయ్ తో ఓ సినిమా, అజిత్ సరసన “వివేగం” చిత్రాలతో బిజీగా ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube